Breaking News

వరద ప్రభావిత 66 సచివాలయంలో పూర్తయిన 100% పారిశుధ్య నిర్వహణ

-అతి త్వరలో వరద ప్రభావితమైన మిగిలిన సచివాలయాల్లో కూడా 100% పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి చేస్తాం*-
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావితమైన 149 సచివాలయాల్లో, సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు 66 సచివాలయాల్లో పూర్తిగా 100% పారిశుధ్య నిర్వహణ జరిగిందని, పురపాలక మరియు పట్నాభివృద్ధి శాఖ నుండి 32 ఐఏఎస్ ఆఫీసర్లు వార్డ్ స్పెషల్ ఆఫీసర్లుగా 149 ఆఫీసర్లు వార్డ్ సచివాలయ స్పెషల్ ఆఫీసర్లుగా, 62 పారిశుద్ధ్య నోడల్ ఆఫీసర్లు, 950 శానిటేషన్ సూపర్వైజర్లు, 6830 పారిశుద్ధ్య కార్మికులతో ప్రతిరోజు వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ శరవేగంగా జరుగుతుందని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలైన ఒకటవ డివిజన్లోని గుణదల ఇన్నర్ రింగ్ రోడ్, 64వ డివిజన్లోని కండ్రిక జంక్షన్ నందు పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాలలో 234 త్రాగునీటి టాంకర్లతో ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణకై 154 ట్రాక్టర్లు, 100 టిప్పర్లు, 59 జెసిబీలు, 14 బాబ్ కాట్లు, 10 డోజర్లు, ఆరు ప్రోక్ లైనర్లు, రెండు క్రేన్లు, 25 కంపెక్టర్లతో మొత్తం 370 వాహనాలతో పారిశుధ్య నిర్వహణ జరుగుతుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాలలో బురద పేరుకుపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్లకు ఆ సమస్యను దూరం చేసేందుకు 110 ఫైర్ ఇంజన్ తో 30545 ఇళ్లను ఫైర్ గన్స్ తో శుభ్రపరిచారని, లోతట్టు ప్రాంతాలలో ఉన్న వరద నీరును బయటకు తీయడానికి 238 డి వాటరింగ్ పంపులు నిత్యం పనిచేస్తున్నాయని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో 458 కిలోమీటర్ల రోడ్లలో దాదాపు 90 శాతం రోడ్లను శుభ్రపరిచారని, 574 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలను తీశారని, ప్రజలు అనారోగ్య పాలు కాకుండా ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్ డ్రోన్ల ద్వారా, పారిశుద్ధ్య కార్మికుల ద్వారా చేస్తున్నారని 88.62 మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడర్ వేశారని అన్నారు. ప్రతిరోజు డ్రైన్లను డీసిల్టింగ్ చేస్తున్నారని ఇప్పటివరకు 534 కిలోమీటర్లలో 421 కిలోమీటర్లు డీసిల్టింగ్ చేశారని అన్నారు. నిల్వ ఉన్న వరద నీళ్లలో 20 డ్రోన్ల సహాయంతో బయో ఎంజీమ్, మలేరియా లార్వాసైడ్ ఆయిల్ ప్రతిరోజు స్ప్రే చేస్తున్నారని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *