Breaking News

లైఫ్ జాకెట్లను ఐ ఓ సి ఎల్ ఉచితంగా అందజేయడం అభినందనీయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వరదల్లో రక్షణ కోసం ఉపయోగించే లైఫ్ జాకెట్లను ఐ ఓ సి ఎల్ ఉచితంగా అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన డివిజనల్ బిజినెస్ హెడ్ లక్ష్మణ రావు 100 లైఫ్ జాకెట్లను జిల్లా కలెక్టర్కు అందజేశారు. వరదలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు లైఫ్ జాకెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అటువంటి లైఫ్ జాకెట్లను అందజేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఐఓసీఎల్ యాజమాన్యం వారిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర్, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి జి. శ్రీదేవి, కనెక్ట్ ఆంధ్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రసాద్, సిపిఓ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *