విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో వరద ముంపుకు చాలా కుటుంబాలు గురవడం ఎక్కువుగా ఆస్తి నష్టం ,వాహనాలు మరమ్మత్తులకు గురి కావడం చాలా బాధాకరమని వరద ముంపుకు గురైన కుటుంబాలకు ప్రతి ఒక్కరూ సహాయంగా నిలవాలని, ఆటోమొబైల్ రంగంలోని వాళ్ళు సామాజిక బాధ్యత గా ముందుకు రావాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు అన్నారు.
స్థానిక బందరు రోడ్డులోని బెంజ్ సర్కిల్లో వరుణ్ బజాజ్ షోరూం నందు సోమవారం ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు, వరుణ్ గ్రూప్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి వీ సత్యనారాయణ కలిశారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ వరద ముంపుకు గురైన ఎన్నో కుటుంబాలకు చెందిన వాహనాలు నీట మునిగాయని, ఆయా ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఫ్రీ సర్వీసింగ్ చేపట్టాలని వరుణ్ గ్రూప్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పివి సత్యనారాయణ కోరారు. వరద బాధితులకు ప్రతి ఒక్కరు సహాయంగా నిలుస్తున్నారని అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పక్షాన ఏపీ జేఏసీ చైర్మైన్, ఏపీ ఎన్జీజీఓస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వి శివారెడ్డి నైతృత్యంలో ఏపీ జేఏసీ నాయకులు ఒకరోజు బేసిక్ పే సుమారు 120 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు అంగీకారాన్ని తెలపడం ఎంతో హర్షనీయమని ఆయన గుర్తుచేశారు.
పీవీ సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరుణ్ గ్రూప్స్ మాట్లాడుతూ విజయవాడలోని వరుణ్ గ్రూప్ సంబంధించిన చాలా ఉద్యోగుల కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయాన్ని వారందరినీ ఆర్థిక సహాయం అందించే విధంగా వరుణ్ బజాజ్ సంస్థ చూస్తుందని ఆయన అన్నారు. వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే సీఎం సహాయ నిధికి రెండు కోట్ల రూపాయలను వరుణ్ బజాజ్ సంస్థ ద్వారా అందించడం జరిగిందని ఆయన తెలిపారు. వరదలో చిక్కుకుపోయిన ద్విచక్ర వాహనాలకు సంబంధించి సర్వీసింగ్ చేయు నిమిత్తం అయ్యే లేబర్ ఛార్జీలలో 50 శాతం వరకు తగ్గించి చేయుటకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వరద నీటిలో ఎక్కువ రోజులు వాహనాలు ఉండటం వలన వాహనాల సంబంధించిన ఇంజిన్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని వీటన్నిటికీ మరమ్మత్తులకు అయ్యే లేబర్ చార్జీలలో 50% వరకు తగ్గించి చేస్తామని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News