విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ విజయవాడ అండగా నిలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గాను నీట మునిగిన వరద బాధితులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ విజయవాడ ఆధ్వర్యంలో రెండోసారి సోమవారం 10 రకాల ఐటమ్స్ తో కూడిన నిత్యావసర సరుకల కిట్ పంపిణీ చేసారు. సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ పాయకాపురంలోని శాంతి నగర్ లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకల కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతులమీదుగా అందించారు. వారు నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ సి.వి.ఎన్. భాస్కర రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ శారద మూర్తి, విజయవాడ రీజనల్ హెడ్ మువ్వల శ్రీధర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News