Breaking News

క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి

-మరమ్మత్తు పనులను చేపట్టి పూర్తి చేయాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడల అభివృద్ది, క్రీడాకారుల్లో సామర్ధ్య పెంపు నేపథ్యంలో క్రీడా వికాస కేంద్రాల అవస్యకత గుర్తించి, తక్షణ మరమ్మత్తు పనులను పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక సీతానగరంలోని క్రీడా వికాస కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వర్షం వల్ల దెబ్బతిన్న క్రీడా వికాస్ కేంద్రంలోని పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ ను పిలిపించి మరమత్తు పనులను ప్రాధాన్యతతో కూడి చేపట్టాల్సి ఉందన్నారు. క్రీడా వికాస కేంద్రం వేదికగా జరుగుతున్న పనుల వివరాలను, మరమ్మత్తు పనుల వివరాలను కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మత్తు పనుల విషయంలో అంచనాలు సిద్ధం చేసుకుని, వాటిని నిర్ధిష్ట సమయంలోగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్ బి వి రెడ్డి, జిల్లా క్రీడా సాధికారికత అధికారి డివివి శేషగిరి, ఆర్ అండ్ బి అధికారులు , సీతానగరం తహసిల్దార్ ఎంపీడీవో, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *