Breaking News

ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధ్యేయం

-ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యం
-ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
-నిడదవోలు పట్టణంలో స్వచ్ఛత హీ సేవా -2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్నమంత్రి
-ప్రజల ప్రాణాలు రక్షించే క్రమంలో వైద్యుల పాత్ర, సేవానిరతిని అభినందించిన మంత్రి
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం నిడదవోలులో స్వచ్ఛత హీ సేవా -2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన స్వయంగా పరిశీలించిన మంత్రి దుర్గేష్ ప్రత్యక్షంగా వైద్యులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్య రక్షణ కోసం నిడదవోలులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నిడదవోలు నియోజకవర్గ ప్రజల రుగ్మతలను, ఇతరత్రా వైద్య సమస్యలను నయం చేసేందుకు స్థానిక డాక్టర్లే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వివిధ విభాగాల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది వచ్చారని మంత్రి తెలిపారు. స్వచ్ఛతాహి సేవా -2024లో పాల్గొన్న ఆరోగ్య సిబ్బందికి మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలు రక్షించే క్రమంలో వైద్యుల సేవలను, సేవానిరతిని మంత్రి కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. దేశాన్ని ఆరోగ్యవంతంగా తయారుచేసుకునేందుకు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిడదవోలు పీహెచ్ సీ డా. పద్మశ్రీ, సూపరింటెండెంట్ ఆలీ, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *