Breaking News

విజన్ 2047 మండల స్థాయి డాక్యుమెంటేషన్ అందచేయ్యలి

-గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించాలి
-క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టాలి
-వందరోజులు మన ప్రభుత్వం పురోగతిపై సమీక్ష
-ఉపాధి హామీ కింద మెటీరియల్ కాంపోనెంట్, పనిదినాలు పని సమీక్ష నిర్వహిస్తాం..
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శాఖల వారీగా నిర్దేశించిన వంద రోజులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లక్ష్యాల పురోగతి తో పాటుగా, రానున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వందరోజుల పురోగతిపై కలెక్టర్ జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా, క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించాల్సిన లక్ష్యాలను సమీక్షించారు. వ్యవసాయ శాఖ పొలంబడి, ప్రి అండ్ పోస్టు విధానంలో హర్టికల్చర్, ఏపిఎమ్ఐపి లో క్రాప్ పెరుగుదల, సెరికల్చర్ సాగు విస్తీర్ణం, పశుసంవర్ధక గోకులం యూనిట్స్, మత్స్య – నాణ్యమైన చేప విత్తనాలు , అగ్రికల్చర్ మార్కెటింగ్, మానవ వనరులు, మునిసిపల్ పరిపాలన, గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాల, తదితర శాఖల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. న్యూట్రీ గార్డెన్ కింద 600 స్కూలు నందు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బడి బయట పిల్లలు నూరు శాతం ఎన్ రోల్ మెంటు అయ్యేలా మండల స్థాయి అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం కింద 97 శాతం మంది విద్యార్థులకు ఆహారం అందిస్తున్నట్లు డీ ఈ వో వివరణ ఇవ్వడం జరిగింది.

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లాలో మూడు నియోజక వర్గాలలో జాబ్ మేళా నిర్వహించారని, మిగిలిన నాలుగు నియోజక వర్గాలలో జాబ్ మేళా నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం కింద సీసీ రహదారులు , డ్రైనేజీ నిర్మాణం తదితర పనులకి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అయితే ఆమేరకు పురోగతి సాధించకపోవడం పై ఎంపిడిఓ లు వివరణ ఇవ్వలన్నారు. మండలస్థాయి లో ఎంపిడిఓ లో పంపే ప్రతిపాదనల్లో రహదారులు, డ్రెయిన్స్ సంయుక్తంగా  నిర్మాణం చేపట్టేలా ఉండాలని స్పష్టం చేశారు. సంక్షేమ శాఖ ల పురోగతిపై వసతి గృహాల నిర్వహణ, చేపట్టవలసిన కార్యక్రమాలు పై సమీక్ష నిర్వహించారు.

హౌసింగ్ నిర్మాణాల పనులు పురోగతి ఎంపిడిఓ లు, స్ధానిక జిల్లా గ్రామీణాభివృద్ధి సిబ్బంది ద్వారా పర్యవేక్షణ అవసరం అన్నారు. మండల ప్రత్యేక అధికారి ప్రతీ శనివారం హౌసింగ్ డే నిర్వహించి, క్షేత్ర స్థాయిలో కాలనీలు సందర్శన, పనుల పురోగతి ని పర్యవేక్షణా చేపట్టాలన్నారు. ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెవిన్యూ పరంగా కుల ధ్రువపత్రాలు జారీ చేయడం లో   సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, ఆమోదించినవి, తిరస్కరించిన వాటిని చెయ్యాల్సి ఉందన్నారు.

ఉపాధిహామీ పథకంలో భాగంగా 38.40 లక్షల పనిదినాలకు గాను 33.38 లక్షలు (87 శాతం) సాధించడం జరిగిందన్నారు. సీతానగరం, రంగంపేట, కోరుకొండ పని దినాలు గుర్తింపు పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రోజువారీ లక్ష్యాలలో 50 శాతం కంటే తక్కువ ఉన్న మండలాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఈ వారంలో  నిర్దేశించిన లక్ష్యాలలో ఇంకా 28, 429  పని దినాల లక్ష్యాలను సాధించాల్సి ఉందన్నారు.

స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి, సెప్టెంబరు 30 నాటికి పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో, ఇతర ప్రభుత్వ శాఖల పరంగా ఆయా గ్రామాల్లో ప్రతిపాదించిన తీర్మానాన్ని, పనులు వారీగా యాక్షన్ ప్లాన్ పై మండల స్థాయి లో సమీక్షా చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం అనుభవజ్ఞులు, మేధావుల, ప్రజలని డిజిటల్ ప్లాట్ ఫారం పై ఏకీకృతం చెయ్యాల్సి ఉంటుందన్నారు. 27 నుంచి 29 వరకూ మానవ వనరులు పై అసవహ ధృక్పథం విధానంలో చర్చలు జరపాలి.

పబ్లికేషన్ మండల డాక్యుమెంట్, విజన్ 2047 నేపధ్యంలో ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకి తెలియ చెయ్యాలి. ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ఆయా సమావేశాలు నిర్వహించాలన్నారు. రెవిన్యూ అంశాలపై సమీక్షా చేస్తూ, వన్ టైమ్ సెటిల్ మెంట్, ఎల్ పి ఎం, మ్యుటేషన్, రీ సర్వే తదితర అంశాలపై సమీక్షా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి సగటు కంటే తక్కువ సమయంలో దరఖాస్తులు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *