Breaking News

సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందనకి పెద్ద ఎత్తున అర్జీలు అందచేసిన ప్రజలు

-అర్జీలు పరిష్కారం కోసం అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున ప్రజలు అర్జీలను సమర్పించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ,జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, దిశా డిస్పి వి. వెంకటేశ్వర్లు, ఆర్ డి టూరిజం వి. స్వామి నాయుడు, డ్వామా పీడీ ఆర్ శ్రీరాములు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన అర్జీలు సుమారు 450 కి పైగా ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీలను ఇచ్చేవారు స్థానిక డివిజన్, మండల స్థాయి అధికారులకు సంబంధిత అర్జి లను అందజేయాలని పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించి అర్జిలను ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా పారదర్శకంగా, జవాబుదారీ తనం తో కూడి పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. విజన్ 2047 నేపథ్యంలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతోందని తెలిపారు.

స్వీకరించిన కొన్నీ అర్జీలు …. సాటిలైట్ సిటీకి చెందిన బురే శ్రావణి వితంతు పెన్షన్ కోసం అర్జీ అందచేశారు.

కడియపులంకకు చెందిన అంకం రత్నరాజు, పట్టా పత్రం జారీ సమయంలో తక్కువ భూమి చూపించారని రీ సర్వే చేపట్టాలని కోరారు.

సీతనగరంకు చెందిన పేపకాయల మంగాయమ్మ వైఫ్ లేటు వెంకటరావు ఎనిమిది నెలల క్రితం భర్త మరణించారని, వితంతు పెన్షన్ కోసం అర్జీ అందచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *