Breaking News

తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 27-09-2024 అనగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి తిరుపతి లోని ఎస్వీ పాలిటెక్నిక్ (SV Polytechnic College,Tirupati)నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా వై ద్వారకనాథరెడ్డి గారు,ప్రిన్సిపాల్ ఎస్వీ పాలిటెక్నిక్, తిరుపతి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు ఇటువంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ హబ్ ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మరొక అతిథిగా గౌరీ శంకర్, హెచ్ ఓ డి , ఎస్వీ పాలిటెక్నిక్, నిరుద్యోగ యువత గురించి మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు రెస్యూమ్ ప్రిపరేషన్ గురించి వివరించారు. ఈ జాబ్ మేళాకు వివిధ రంగాలకు చెందిన 5 బహుళ జాతీయ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు హాజరవ్వడం జరిగినది. ఇందులో భాగంగా ఈరోజు జరిగిన జాబ్ మేళాకు 104 మంది యువతీ యువకుల వివిధ కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరవుగా 66 మంది వివిధ కంపెనీలలో ఉద్యోగాలు కు సెలెక్ట్ అవడం జరిగింది. ముఖ్య అతిథులు ద్వారా వారికి ఆఫర్ లెటర్ అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపికృష్ణ, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ,తిరుపతి జిల్లా, యాచంద్రారెడ్డి, మాస్టర్ ట్రైనర్, ఐ ఎల్ ఓ, శైలజ గారు ,హెచ్ ఓ డి, ఎస్ వి పాలిటెక్నిక్ కళాశాల, రేవతి యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ సిబ్బంది, ఏపీ ఎస్ ఎస్ డి సి సిబ్బంది అయినా సునేషు, గణేష్, మహేష్, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *