అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. నేడు విజయవాడలో నారా వారికి వేద పండితులు అమ్మ వారి ఆశీర్వాదాలు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా దేవి దసరా నవరాత్రి మహోత్సవాలకు మంత్రి ఆనం ఆహ్వానించారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీశైలం మరియు విజయవాడ దేవస్థాన ఇఓలు.. మరియు వేద పండితులతో కలిసి దసరా ఉత్సవాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానించారు. వేద ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లను వేద పండితులు ఆశీర్వదించగా, ఘనంగా సత్కరించి శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేయాలని ఆహ్వాన పత్రికలు మంత్రి ఆనం అందజేశారు.
Prajavartha Online Telugu News