Breaking News

సచివాలయ మహిళా ఉద్యోగులకు ముగిసిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలోని స్విమ్స్ శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజి ఆధ్వర్యంలో అమరావతిలోని సచివాలయంలో మహిళా ఉద్యోగులకు పింక్ బస్ ద్వారా రెండు రోజుల పాటు జరిగిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. బ్లాక్ నంబరు 3లోని మహిళా ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు విశేషంగా పాల్గొని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.

ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ, సచివాలయ మహిళా ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు సచివాలయంలో పింక్ బస్ క్యాంపు నిర్వహించారు. ఇందులో నోటి క్యాన్సర్ పరీక్షలు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలను గుర్తించేందుకు పాప్ స్మియర్, రొమ్ముక్యాన్సరుకు సంబంధించిన మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేపట్టారు. ఒక్కొక్కరికి దాదాపు రూ.10,000/- దాకా ఖర్చయ్యే ఈ పరీక్షలను మహిళా ఉద్యోగులకు ఉచితంగా నిర్వహించారు. పింక్ బస్ లోపల పూర్తిగా మహిళా వైద్యులు, సిబ్బందితో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ తోపాటు గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి నిపుణులైన గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్ టి, డెంటల్ సర్జరీ వైద్యులు వైద్యసేవలందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్సీడి స్టేట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శారద, స్విమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి, కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ బాబు, ప్రివెంటివ్ అంకాలజి నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్, పింక్ బస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత, పిఆర్వో డి.చంద్రమోహన్ మరియు సిబ్బంది, ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కె.వైడూరిదేవి, వైస్ ప్రెసిడెంట్ ఎం.లక్ష్మణకుమారి, సెక్రటరీ ఏ.సుస్మిత, అడిషనల్ సెక్రటరీలు ఎం.రాజేశ్వరి, ఎన్.నాగలలితా దేవి, జాయింట్ సెక్రెటరీ కె.సునీత, ట్రెజరర్ టి.శారద, గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల నుండి నిపుణులైన గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్ టి, డెంటల్ సర్జరీ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి 40 మంది వైద్య బృందం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *