Breaking News

ఇసుక త్రవ్వకాలు, సరఫరా పై కలెక్టరు టెలి కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రీచ్ ల వారీగా లభ్యత ఉన్న ఇసుక వివరాలు ఆన్లైన్ లో ప్రతిభంబించాలని, కేటాయింపు చేసి ఇసుక త్రవ్వకాలు ప్రారంభించని బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు స్థానంలో వేరొకరికి కేటాయించి రవాణా కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి ఇసుక సరఫరా, రెవిన్యూ తదితర అంశాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక బుకింగ్ విధానం లో పారదర్శకత జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోకి అన్ని రీచ్ లలో ఇసుక అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఆమేరకు టెక్నీకల్ టీమ్స్ ఆధ్వర్యంలో ఎప్పటి కప్పుడు ఇసుక డేటా వివరాలు నమోదు చేయాలన్నారు. ఆమేరకు అప్లోడ్ చేసిన వివరాలు ఆన్ లైన్ లో , యాప్ లో కూడా ప్రతిబింబించేలా పర్యవేక్షణా తప్పనిసరి గా చెయ్యాల్సి ఉంటుందన్నారు. బల్క్ బుకింగ్ విధానం లో జాయింట్ కలెక్టర్ వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టాలన్నారు . బల్క్ బుకింగ్ కేటాయింపులు సరఫరా తదితర అంశాలను స్వయంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బుకింగ్ విధానం అలాట్ అయిన వాటిని తిరస్కరించకుండా, ఇసుక అందుబాటులో ఉండే క్రమంలో పంపిణి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవో లు క్షేత్ర స్థాయిలో వ్యక్తిగత పర్యవేక్షణ తప్పనిసరి అని తెలిపారు. ఇసుక త్రవ్వకాల విషయంలో ముందుకు రానీ బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు స్థానంలో వేరొక. బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులకు కేటాయించి ఇసుక తవ్వకాలు విషయంలో ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందనీ కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు. రెవెన్యూ సంబంధ అంశాలపై, 22 ఏ, ప్రభుత్వా ప్రాధాన్యతా కార్యక్రమాల కోసం కేటాయించిన స్థలాలు కేటాయించడం తదితర అంశాలపై డివిజన్ మండల స్థాయి అధికారులు కలెక్టరు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ టెలి కాన్ఫరెన్స్ లో డి ఆర్వో/ ఇన్చార్జి జెసి జి నరసింహులు, ఆర్డీవో లు ఆర్డీఓ లు ఆర్ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ &జూవాలజి అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, సమన్వయ శాఖల అధికారులు, ఇతర మండల స్థాయి అధికారులు, సిబ్బంది ర్యాంపు ల ఇన్చార్జి లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *