-సాయంత్రం కలెక్టరేట్ కు సిబ్బంది
-వొచ్చి వ్యక్తిగత వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం
కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
విధి నిర్వహణలో నిబద్ధత, జవాబుదారీ తనం కలిగి ఉండాలని, నిర్లక్ష్య వైఖరి వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కోరుకొండ తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, హజరు పట్టిక ప్రకారం హాజరైన సిబ్బంది వివరాలు డ్యూటీ లో డిప్యూటి తహసీల్దార్ ఏ రజనీ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో విధుల్లో ఉండాల్సిన సిబ్బంది ఎందుకు కార్యాలయంలో లేరని? వివరాలు తెలుసుకుని, హజరు పట్టిక ను తన వెంట తీసుకుని వెళ్ళి, సంబంధిత సిబ్బంది కలెక్టరేట్ కు వొచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసిల్దార్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టడం కోసం పంపడం జరిగిందనీ, ఈ సమయంలో కార్యాలయ విధుల్లో ఉండాల్సిన సిబ్బంది బాధ్యత రాహిత్యంతో వ్యవహరించిన తీరు పై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ ఉద్యోగులు విధి నిర్వహణలో ఖచ్చితంగా సమయ పాలన పాటించడం, సిబ్బంది కదలికలను సంబంధిత రిజిస్టర్ లో నమోదు చేసి తదుపరి మాత్రమే ఆయా విధుల్లో హాజరు కావాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిలక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది నుంచి తగిన వివరణ తీసుకొని నివేదిక అందచేయాలని తహసిల్దార్ ని కలెక్టరు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఎటువంటి అనుమతులు లేకుండా గైరాజరైన సిబ్బంది వివరాలను హజరు పట్టిక లో కలెక్టర్ నమోదు చేశారు
Prajavartha Online Telugu News