Breaking News

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్

కొవ్వూరు / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 9 బుధవారం కాపవరం గ్రామంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 9 బుధవారం సాయంత్రం 4.00 గంతలకు తూర్పుగోదావరి జిల్లా కాపవరం గ్రామంలోని రైతు సేవా కేంద్రం లో ఏర్పాటుచేసిన ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు జిల్లా మేనేజర్ (పౌర సరఫరాల) టి రాధిక సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు కందుల దుర్గేష్ , జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులు పాల్గొననున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *