Breaking News

ఉయ్యూరు హనుమాన్ నగర వాసులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాను

-తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ 

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉయ్యూరు నగర పంచాయితీ పరిధిలోని 16వ వార్డు హనుమాన్ నగర్ వాసులు తమ ఆస్తులు స్థలాలను 22A జాబితా నుండి తొలగించవలసినదిగా కోరుతూ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ ని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు,స్పందించిన రాజేంద్ర ప్రసాద్ వెంటనే జాయింట్ కలెక్టరు,మరియు ఉయ్యూరు MRO తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిస్కరించవలసినదిగా కోరారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గతంలో హనుమాన్ నగర్లోని స్థలాలు ఎన్నో సంవత్సరాలు గా ఎటువంటి అభ్యంతరం లేకుండా క్రయవిక్రయాలు జరిగి రిజిస్ట్రేషన్లు జరిగాయని కానీ 5 సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా అధికారులు అక్కడి స్థలాలు 22Aకింద ఉన్నాయని రిజిస్ట్రేషన్ల ను ఆపివేశారు,అక్కడి నివాసులు అవి తమ స్వంత భూములని వాటిని 22Aనుండి తొలగించవలసినదిగా గత 5 సంవత్సరాలుగా పోరాటం చేసినా గానీ అధికారులు కానీ అప్పటి ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని అన్నారు, హనుమాన్ నగర్ భూములను 22A నుండి తొలగించేందుకు కృషి చేస్తానని అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ కార్యదర్శి రాజులపాటి ఫణి కుమార్ ,మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, తెదేపా రాష్ట్ర సగర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, TNSF టౌన్ ప్రెసిడెంట్ జంపాన తేజ ,తెలుగుదేశం పార్టీ నాయకులు జంపాన నరసింహారావు, వీరంకి నాగబాబు, చిమట శోభనాద్రి మరియు 16 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *