ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గా దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని గురువారం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు మహబూబ్ మండపం వద్ద వేద ఆశీర్వచనం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సూచనల మేరకు శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. సామాన్య భక్తుల సైతం దర్శనం సాఫీగా నిర్వహించు కోగలుగుతున్నారంటే అన్ని శాఖల సమన్వయ సమిష్టికృషి కారణమని ఆయన అన్నారు. అమ్మవారి ఆశీర్వచనం వలన తాను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కిందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ఆర్టీసీ రథచక్రాలు వంటిదని, అమ్మవారి దయతో ఆర్టీసీ లాభాలతో సురక్షితంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News