గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నందు భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 6 రోజుల పాటు నందు జరుగు నాలుగవ కాశ్మీర్ యూత్ ఎక్సేంజ్ కార్యక్రమం లో డా. వేణుగోపాలరెడ్డి సెమినార్ హాల్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో కాశ్మీర్ లోని 6 జిల్లాలైన పుల్వామా, బుడ్గామ్, శ్రీనగర్, కుప్వారా, బారాముల్లా మరియు అనంతనాగ్ నుంచి మొత్తం 132 మంది యువతి యువకులు హాజరైయ్యారు. ఈ సందరంభముగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ దేశ వ్యాప్తముగా ఎన్నిక చేయబడిన నెహ్రూ యువకేంద్రాలలో గత మూడు సంవత్సరాలుగా కాశ్మీరీ యువ సమ్మేళనం కార్యక్రమం నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, కాశ్మీర్ యువకులలో జాతీయ ఐక్యత మరియు సమగ్రతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నదని అలాగే కాశ్మీరీ యువతకు ఇక్కడ సంస్కృతి,సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు సహా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి యువ సమ్మేళనంలో వివరిస్తారని అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే గంగాధరావు మాట్లాడుతూ మన దేశం లో యువత ఎక్కువగా ఉన్నారని, జాతీయ ఐక్యత, సమగ్రత, శాంతి ప్రతిపాదకులుగా యువతి యువకులు వ్యవహరించేలా అవగాహన కల్పించడం అలాగే దేశంలోని సాంస్కృతిక, పారిశ్రామిక, చారిత్రక, పర్యాటక విద్యాపరమైన ప్రముఖ ప్రదేశాలను సందర్శించేందుకు అవకాశం యువ సమ్మేళనం వలన కలుగుతుంది అని అన్నారు. గుంటూరు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి మాట్లాడుతూ వివిధ అంశాలపై కార్యశాలలు అలాగే రెండు రోజుల క్షేత్ర స్థాయి సందర్శనలతో కార్యక్రమం జరగనుంది అని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ప్రతి శాఖనుంచి సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ కె రత్న షీలా మణి, రెక్టర్, ప్రొఫెసర్ జి సింహ చలం, రిజిస్ట్రార్, ప్రొఫెసర్ దివ్యతేజో మూర్తి, కోఆర్డినేటర్, ఎన్ ఎస్ ఎస్, ప్రొఫెసర్ ఆర్ వి ఎస్ ఎస్ ఎన్ రవి కుమార్, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి వి విజయ లక్ష్మి, నెహ్రూ యువ కేంద్ర వైజాగ్ జిల్లా యువ అధికారి జి మహేశ్వరరావు గౌరవ అతిధులగ హాజరై ప్రసంగించగా, కామన్ మాన్ సురేష్ గుప్త ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ గురించి వివరించారు. ఈ సందర్భంగా సి బి సి, డి ఆర్ డి ఏ, మెప్మా డిపార్ట్మెంట్ తరుపున స్టాల్ల్స్ ఏర్పాటు చేస్సారు. కార్యక్రమం లో కాశ్మీరీ యువత సాంస్కృతిక ప్రదర్శనతో సందడి చేశారు.
Prajavartha Online Telugu News