-15 వ ఆర్ధిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలి
-సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తో సమన్వయ శాఖలు ప్రతిపాదనలు అందజేయాలి
-మరుగుదొడ్ల నిర్మాణం, శుద్ధమైన త్రాగునీటి వ్యవస్థ, వాల్ పెయింటింగ్ లు 45 రోజుల్లో పూర్తి చెయ్యాలి
-కలక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపం యొక్క సవాళ్లను పరిష్కరించడానికి సక్షం అంగన్వాడీ మరియు పోషణ్ 2.0 సమీకృత పోషకాహార మద్దతు కార్యక్రమం అమలు , 15 వ ఆర్ధిక సంఘం నిధులతో అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలను మెరుగు పరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కోన్నారు.
మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో ” సక్షం అంగన్వాడీ మరియు పోషణ్ 2.0 – 2024-25 ” అమలు చేస్తున్న తీరుపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలలో మెరుగైన వసతుల కల్పన కోసం స్ర్తీ శిశు సంక్షేమ శాఖ కు సక్షం పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చెయ్యడం జరిగిందన్నారు. 2024-25 సంవత్సరానికి గాను చేపట్టనున్న పనులను అనుసరించి చక్కటి ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఐ సి డి ఎస్, ఇతర సమన్వయ శాఖలు, ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో అందజేసే ప్రతిపాదనలు అందుబాటులో ఉన్న నిధులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఐ సి డి ఎస్ పిడి కె విజయ కుమారి మాట్లాడుతూ, జిల్లాలో 704 అంగన్వాడీ సొంత భవనాలు ఉండగా , 115 కేంద్రాల్లో మరుగుదొడ్లు, 39 త్రాగునీటి వ్యవస్థ ఏర్పాటు చెయ్యాల్సి వుందన్నారు. టాయిలెట్స్, వాల్ పెయింటింగ్, త్రాగునీటి వ్యవస్థ కోసం నిధులను విడుదల చెయ్యడం జరిగిందని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. వాల్ పెయింటింగ్ అనుబంధంగా చేపట్టాల్సిన పెయింట్ పనుల కోసం రూ.19,800, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం కోసం 36 వేల రూపాయలను, పొషన్ వాటికాస్ కోసం రూ 10 వేలు కేటాయించడం జరిగిందన్నారు. ఆమేరకు నిధులను ఫలవంతం అయ్యే విధంగా ఐసిడిఎస్, ఇంజనీరింగ్ విభాగాల , డ్వామా , గ్రామ పంచాయతి అధికారులు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం లో ఉపాధిహామీ పథకం మార్గదర్శకాలని అనుసరించాల్సి ఉంటుందన్నారు. వాటితో పాటు గా విద్యుత్ సరఫరా, త్రాగునీరు సరఫరా తదితర అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఇందుకోసం 45 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలలో త్రాగునీరు సరఫరా కోసం గ్రామ పంచాయతీ ద్వారా పైప్ లైన్లు ద్వారా త్రాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్ వో ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధమైన త్రాగునీటినీ చిన్నారులకు అంద చెయ్యాల్సి ఉంటుందఎన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పోషన్ వాటికాస్ కాంపోనెంట్ కింద యూనిట్ ఖర్చు 10 వేల రూపాయలతో పచ్చని ఆకు కూరలు (8 రకాలు), ఔషధ మొక్కలు/ పండ్ల చెట్లు (5 లేదా 6 చెట్లు) పెంచాల్సి ఉంటుందనీ కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో సాంకేతికత తో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటడం, వాటి పరిరక్షణ దిశగా తగిన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో రైన్ హార్వెస్టింగ్ విధానం ను ఆచరణీయం చేసేలా చొరవ చూపాలని డ్వామా పిడి ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఐసిడిఎస్పిడి కే విజయ కుమారి, డ్వామా పీడీ ఆర్. నాగ మల్లేశ్వర రావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ – బివి గిరి , జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఏపీఈపిడిసియల్ ఎస్ ఈ – కే. తిలక్ కుమార్, ఇన్చార్జి డి వి పి వో ఎమ్. నాగలత, సిడిపివో లు, ఇతర అధికారులు ఇంజినీరింగ్ సహాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News