Breaking News

ఈవీఎం గోడౌన్‌ ను తనిఖీ చేసిన జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా.నిధి మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడి మార్కెట్‌ యార్డ్‌లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదామును మంగళవారం జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. ఈవీయంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్‌ గోడౌన్‌ కు వేసిన సీల్డ్‌ లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను, సిసి కెమెరాల నిఘా ను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాట్‌ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపవలసి ఉంటుందన్నారు. ఈవీఎం గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహించారు.
తనిఖీలో డిఆర్ఓ వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ డిటి మధుబాబు, అధికారులు,సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *