Breaking News

పీఎం స్వా నిథి అమలులో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు

-కనపరిచిన అధికారులు, బ్యాంకర్లకు అభినందనలు
-పీఎం స్వా నిధి లో రాష్ట్ర స్థాయిలో 38 అవార్డులు
-పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీఎం స్వా నిధి పధకం అమలు
-రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం
-పీఎం స్వా నిధి పథకాన్ని డ్వాక్రా సంఘాలు, చిరువ్యాపారులు వినియోగించుకోవాలి
-ఈ పథకంలో బ్యాంకుల నుంచి 7 శాతం సబ్సిడీ అందిస్తున్నాం
-రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలంతా పీఎం స్వా నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పీఎం స్వా నిధి పధకం రాష్ట్ర స్థాయి అవార్డుల కార్యక్రమంలో మంగళవారం మంత్రి నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇంకా ఎక్కువ అవార్డులు సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. కోవిడ్ సమయంలో మొదట నష్ట పోయింది స్ట్రీట్ వెండర్స్ అని వారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందని అందులో ముఖ్యంగా పీఎం స్వానిధి పథకమన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. రాష్ట్రంలో అందరి ఆదాయం రెట్టింపు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారనన్నారు. అందుకు అనుగుణగా మెప్మాలో అనేక కార్యక్రమాలు తీసుకుని పని చేస్తున్నామన్నారు. గతంలో పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో 2014 నుంచి 2019 వరకు మెప్మాలో అనేక పథకాలు అమలు చేశామన్నారు. ఇప్పుడు ప్రజలందరికీ మేలు చేయడానికి, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశ్యంతో వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అందుకే ఐఏఎస్ అధికారిని మెప్మా కు ఎండీ కావాలని ముఖ్యమంత్రిని అడిగి మరీ అధికారిని ని తీసుకొచ్చానన్నారు. అంతకుముందు ఈ శాఖకు ఐఏఎస్ అధికారి లేరన్నారు. కేంద్రం ఫండ్స్ ను సద్వినియోగం చేసుకోవడానికి అందరూ కృషి చేయాలన్నారు. పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడాలన్నారు.
పీఎం స్వానిధి క్రింద మొదటి సారి రుణం రూ.10 వేలు తీసుకుని సక్రమంగా చెల్లిస్తే మరలా రూ. 20 వేలు ఇవ్వడం అవి కూడా సంవత్పరంన్నర కాలంలో కడితే రూ. 50 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతటితో ఆగిపోదు కోటి రూపాయలు ఆపైన కోటిన్నర పొందవచ్చన్నారు. ప్రభుత్వ సహకారం కూడా ఇందులో ఉంటుందన్నారు. పీఎం స్వా నిధి పథకం కింద లబ్దిదారులకు రుణాలపై కేంద్రం 7 శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నారు. కేవలం 4.5 శాతం వడ్డీ మాత్రమే లబ్దిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. పీఎం స్వానిధి పథకం కింద తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే కోట్లల్లో రుణాలు పొందవచ్చన్నారు… ఈ రుణాలను సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధిని సాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ భద్రతా పథకాల్లో భాగంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన తదితర పథకాలతోపాటు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే పథకాలను తీసుకొచ్చిందన్నారు.. రాష్ట్రం నుంచి పీఎం స్వా నిధి పథకం కింద 5 లక్షల 48 వేల 957 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో 5 లక్షల 2 వేల 894 మంది పేదలకు రుణాలిచ్చారన్నారు.
పీఎం స్వానిథి అమలులో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనపరిచిన అధికారులు, బ్యాంకర్లకు అభినందనలన్నారు. రుణ మంజూరులో ఉత్తమ పనితీరు కనబరచిన అవార్డులు గెలిచిన గుంటూరు కార్పొరేషన్, పుత్తూరు, రాయచోటి మేజర్ మన్సిపాలిటీ కమిషనర్లకు అభినందనలన్నారు. అత్యుత్తమ పనితీరు కనపరిచి రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించిన పలు మైనర్ మున్సిపాలిటీ కమిషనర్లు, బ్యాంకర్లకు కు అభినందనలన్నారు. పేద మహిళలు లక్షాధికారులు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్య మన్నారు. మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో వివిధ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 2020-2024… మధ్య కాలంలో 5.03 లక్షల మందికి 741 కోట్లు రుణాలను అందించగా.. 2024 లోనే పేదలకు 288 కోట్లు రుణాలు అందించామన్నారు.
సాంకేతికను ఎక్కువ వాడితే మోసానికి ఆస్కారం ఉండదని, ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్ కు ప్రోత్సాహం ఉందన్నారు. పీఎమ్ స్వానిధి పథకం సమర్థవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర స్థాయిలో 38 మందికి అవార్డులు పీఎం స్వా నిధి ప్రైస్ అవార్డులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పలు మున్సిపాల్టీల కమిషనర్లు, బ్యాంకు అధికారులకు ఈ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ”పీఎం స్వా నిధి” పథకం ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్దికి కృషి చేసినందుకు ఎన్. తేజ్ భరత్, మిషన్ డైరెక్టర్ మరియు మెప్మా డైరెక్టర్ కు మంత్రి అభినందించారు.
ఎస్ ఎస్ బీసీ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ దాస్యం మాట్లాడుతూ పేదలకు లబ్ది చేసినందుకు అధికారులకు, బ్యాంకర్లకు అవార్డులు ఇవ్వడం అభినందనీయమన్నారు. లబ్దిదారులు తొలుత పదివేలు లోన్ తీసుకుని సక్రమంగా చెల్లిస్తే 50 వేలు వరకు లోన్లు తీసుకోవచ్చన్నారు. రుణాలు సకాలంలో చెల్లించిన వారికి పది లక్షల ముద్ర లోన్లను సైతం తీసుకోవచ్చు..పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు 5 కోట్ల వరకు రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం రాష్ట్రం లో పిఏం స్వా నిధి పధకం క్రింద 10 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి నారాయణ అందించారు.
కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, విశాఖ పట్టణం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, గుంటూరు మున్సిపల్ కమిషనర్ పి. శ్రీనివాసరావు, ఎస్బీఐ డీజీఎం, మనీష్ కుమార్ సింగ్, ఎన్టీఆర్ జిల్లా పీడీ మెప్మా వెంకట నారాయణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *