Breaking News

సీ.ఎల్ఐ. ఎస్ సి కోర్సు కు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఐదు నెలల కాల వ్యవధి గల C.LI.Sc. కోర్సు కు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఆర్ ప్రసన్న కుమార్, సంచాలకులు, పౌర గ్రంథాలయ శాఖ వారు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. శిక్షణా తరగతులు ఈ ఏడాది డిసెంబర్ నుండి 30 ఏప్రియల్, 2025 వరకు జరుగుతాయని ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్ అందిస్తారని తెలిపారు. పి.ఎన్. స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, విజయవాడ, రాయలసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, కడప, వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్, గుంటూరు నందు శిక్షణా సంస్థలో కోర్సులు చేయవచ్చన్నారు. మూడు శిక్షణా సంస్థల్లో ఒక్కో శిక్షణా సంస్థలో ఇంగ్లీషు, తెలుగు మీడియంలలో 40, 40 సీట్లు ఉన్నాయని, మూడు శిక్షణా సంస్థల్లో మొత్తం 240 సీట్లు ఉన్నాయని వివరించారు. రెండు సంవత్సరాల ఇంటర్ లేదా యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నందు ఉత్తీర్ణులై ఉండాలని, అర్హత పరీక్షలలో అభ్యర్థి పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందన్నారు. అర్హత పరీక్షలో పొందిన మొత్తం మార్కులకు అదనంగా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 5, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు 10 మార్కులు కలుపబడును అని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపచేయబడును అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు శిక్షణా సంస్థ ప్రిన్సిపల్ వారి పేరున రూ. 2 పోస్టల్ ఆర్డర్స్ ను సమర్పించి దరఖాస్తును పొందాలని సూచించారు. నవంబర్ 1 నుండి నవంబర్ 15 వరకు దరఖాస్తులు ఆయా కళాశాలల్లో విక్రయిస్తారని, పూర్తి చేసిన దరఖాస్తులు నవంబర్ 18 సాయంత్రం 5గంటల లోపు అందించాలని సూచించారు. పోస్టల్ వారి ఆలస్యమునకు సంస్థకు ఎటువంటి సంబంధం లేదు అని పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఎంఆర్. ప్రసన్న కుమార్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *