-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత పాలకులు నిధులు కెటాయించకుండా అభివృద్ది అంటూ ప్రచారంతో కాలక్షేపం చేశారని, జగనన్న హయంలో విజయవాడను ఐకాన్‌గా అధునిక హంగులతో భవానీపురం స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సొమవారం అధికారులతో కలిసి మంత్రి నగరంలో పలు ప్రాంతాలను పర్యటించారు. 44వ డివిజన్ లో చెరువు సెంటరు, లేబర్ కాలనీ, యద్దనపూడి వారి వీధి, మొఘల్ వారి వీధి, అప్పలస్వామి క్వారీ మీదుగు నాలుగు స్తంభాల సెంటరు తదితర ప్రాంతాలను పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు..పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో తాగునీరు సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. 44వ డివిజన్ కొండ ప్రాంతంలో తాగునీరు ఇబ్బందులు పరిష్కారంలో భాగంగా బూష్టర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో కామకోటినగర్, మువ్వలవీధి, యద్దనపూడి వారివీధి, మొఘల్ వారి వీధి, అప్పలస్వామి క్వారీ తదితర ప్రాంతాలకు తాగునీరు సమస్య తీరుతుందన్నారు. ఈ ప్రాంతంలో డ్రైనేజి పారుదలకు, అదే విధంగా రోడ్డుపై వర్షపునీరు నిల్వలేకుండా చర్యలు చేపట్టాలన్నారు. లేబర్ కాలనీలో శిథిలమైన ఆరు బిల్డింగ్ లో ఉంటున్నవారు వారి సమస్య పరిష్కారించాలని మంత్రిని కోరడంతో వారికి వేరోక చోట స్థలంగాని లేదా వారికి భవనం నిర్మించి ఇచ్చేందుకు గల సాధ్యసాధాలను పరిశీలించి, అంచనాలు తయారు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌కు మంత్రి ఫోన్ లో సూచించడం జరిగింది. అదే విధంగా భవానీపురం స్టేడియం స్థలాని మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు.. పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేడియం నిర్మాణం పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావలన్నారు. క్రీడాకారులు బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్ బాల్, హ్యండ్ బాల్ వంటి పలు రకాల ఆటలు విడివిడిగా అందుబాటులో విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఆధునిక హంగులతో స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇటివల కరోనాతో మృతి చెందిన బి. సునీల్ కుటుంబ సభ్యలను మంత్రి పరామర్శించారు.. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యలను మంత్రి 20 వేల రూపాయల నగదును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో 44 వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్న కుమారి గారు నగర పాలక సంస్థ అధికారులు, వైసీపీ శ్రేణులు ఉన్నారు.