మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ శాఖలలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వందరోజుల ప్రణాళిక లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేయడంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
చెత్త నుండి సంపద కేంద్రాలు పటిష్టవంతంగా అమలులోకి తేవడానికి అప్రోచ్ రోడ్లు, వాటర్ విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు, చిన్నచిన్న రిపేర్లు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలకు సంబంధించి నూరు శాతం విద్యార్థులు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఫామ్ పొండ్స్, హార్టికల్చర్ ప్లాంటేషన్, ఉపాధి హామీలో రోడ్లు పనులు పూర్తి చేయాలని, పూర్తయిన పనులకు సంబంధించి త్వరగా బిల్స్ అప్లోడ్ చేస్తే డబ్బులు త్వరగా వస్తాయని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ షాపులు నిబంధనల మేరకు భర్తీ చేయాలన్నారు. ఐసిడిఎస్ లో అవేర్నెస్ కార్యక్రమాలు పూర్తి చేయాలని, 148 అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పనకు నిధులు విడుదల కాగా పనులు సత్వరమే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. గ్రామపంచాయతీలలో వసూలు చేస్తున్న ఆస్తి పన్నులో మూడు శాతం స్పోర్ట్స్ సెస్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఖాతాకు జమ చేయడం గురించి కలెక్టర్ ఆరా తీశారు. నెక్స్ట్ మీటింగ్ నాటికి నూరు శాతం ప్రగతి సాధించాలన్నారు
జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాలు ప్రారంభోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసే శిలాఫలకాల్లో ప్రోటోకాల్ అమలు చేయాలని అన్నారు అనంతరం కలెక్టర్ వరదలకు సంబంధించి పంట నష్టాలపై సమీక్షిస్తూ జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే విషయంలో కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో మొదటి విడత 37,765 మంది రైతులకు 56.70 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ, రెండో విడత 2294 మంది రైతులకు 3.21 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో బందరు ఉయ్యూరు గుడివాడ ఆర్డీవోలు కే స్వాతి, షారోన్, జి బాలసుబ్రహ్మణ్యం, డిఎస్ఓ వి పార్వతి, డిపిఓ జే.అరుణ, డ్వామా పిడి శివప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, జెడ్పిసిఈఓ కన్నమ నాయుడు, ఐసిడిఎస్ పిడిఎస్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News