కోవిడ్ బాధితులను గుర్తించడమే లక్ష్యంగా ఇంటింటికి ఫీవర్ సర్వే… : కలెక్టర్ జె. నివాస్ 


-పామర్రు మండలంలో కోవిడ్ పరీక్షలు ముమ్మరం చేయాలి…
-విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…
-విధుల పట్ల నిర్లక్షం వహించిన పెదమద్దాలి సచివాలయ గ్రేడ్ 5 కార్యదర్శి రామకృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన…

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కోవిడ్ కట్టడే లక్ష్యంగా ప్రతి గ్రామంలో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహిస్తూ కోవిడ్ నిర్థారణ పరీక్షలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం స్థానిక తాహశీల్థారు కార్యాలయంలో తాహశీల్థారు, ఎంపీడీవో, నోడల్ అధికారులుమరియు వైధ్యాధికారులతో కలెక్టరు జె.నివాస్ వివిధ అంశాలపై సమీక్షించారు. కరోనా సెకండ్ వేవ్ ను ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వాలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటీకీ వెళ్లి ఫీవర్ సర్వే ఖచ్చితంగా చెయ్యాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి పరిశీలించకుండా ఫీవర్ సర్వే చేసినట్లు గాను, కరోనా పాజిటివ్ కేసులు లేవని తప్పుడు నివేదికలు చూపించిన వారిని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి వాలంటీర్ల నిల్ రిపోర్ట్ అందించిన నివేదికలపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు తమకు పాజిటివ్ అని తెలిసినప్పటికీ చెప్పకపోవడం, తగు జాగ్రత్తలు తీసుకోకపోడంతో అది మరింత ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తికి దారితీస్తుందని,ఈ విషయంపై వారిలో అవగాహనా కలిగించి హోం ఐసోలేషన్ లేదా ఆసుపత్రిలో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాజిటివ్ గా గుర్తించిన వారిలో భరోసా కల్పించాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుని ఫీవర్ సర్వే నిర్వహించి పాజిటివ్ రేట్ ను తగ్గించడానికి కృషి చేయాలన్నారు. అదే విధంగా ప్రజలు కోవిడ్ నిభందనలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని, తరుచు తనిఖీలు నిర్వహించి ప్రజలతో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలో భాగంగా వారంలో మూడు రోజుల పాటు సొమ, మంగళ, బుధవారంల్లోప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లోను, మంగళవారం ట్రాన్స్ పోర్టు వాహనాలు, లారీలు, ఆటోలు ఇతర వాహాన చోదకులకు, బుధవారం తమ పరిధిలో గల ప్రజలకు కోవిడ్ నియంత్రణ పట్ల అవగాహన కలిగించాలన్నారు.
పెదమద్దాలి గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి విధుల పట్ల నిర్లక్షం వహించిన గ్రేడ్- 5 కార్యదర్శి రామకృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన కలెక్టరు జె. నివాస్
తొలుత జిల్లా కలెక్టరు జె. నివాస్ పామర్రు మండలం పెదమద్దాలి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయ ముఖ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, లబ్దిదారుల వివరాలు, సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబందించి డిప్లై బోర్డులు లేకపోవడాన్ని చూసి సచివాలయ గ్రేడ్ -1, గ్రేడ్ -5 కార్యదర్శుల పై కలెక్టరు సీరియస్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాల్లో భాగంగా పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు అందజేస్తుంటే వాటి వివరాలను ఎందుకు మీరు డిస్పై చెయ్యలేదని వివరణ కోరారు. వర్షం కారణంగా లోపల పెట్టామని నిర్లక్షపు సమాదానం రావడంతో విధులు పట్ల అలసత్వం వహించిన సచివాలయ గ్రేడ్ 5 కార్యదర్శి ఎస్.రామకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. గ్రేడ్ -1 కార్యదర్శి పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.
సమావేశం లో పామర్రు తాహశీల్థారు సురేష్ కుమార్, యంపీడీవో రామకృష్ణ, మండల ప్రత్యేకాధికారి, నోడల్ అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *