-డిప్యూడి డైరెక్టర్ ఎస్.యం మహబూబ్ బాషా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో పనిచేసి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువద్దామని సమాచార శాఖ ఉపసంచాలకులు ఎస్.యం మహబూబ్ బాషా చెప్పారు. జిల్లా పౌర సంబంధాధికారిగా పనిచేస్తున్న యం. భాస్కరనారాయణ పదోన్నతి పై విజయవాడ రాష్ట్ర సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. ప్రస్తుతం సహాయ సంచాలకులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణాజిల్లా ఉపసంచాలకులు మహబూబ్ బాషా నుండి సోమవారం భాస్కరనారాయణ ఎడిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సమావేశంలో ఉప సంచాలకులు ఎస్యం మహబూబ్ బాషా మాట్లాడుతూ జిల్లా పౌర సంబంధాధికారిగా పనిచేసిన కాలంలో భాస్కరనారాయణ సమర్థవంతంగా సేవలందించారని కొనియాడారు. 2019 సాధారణ ఎన్నికలు కోవిడ్ సమయంలో జిల్లా యంత్రాంగానికి మీడియా ప్రతినిధులను సమన్వయం చేసి సమాచారం అందించడంలో కీలక పాత్ర వహించి జిల్లా కలెక్టర్ మన్ననలు పొందరాని అన్నారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం విఐపి, వివిఐపి పర్యటనలు జిల్లా కలెక్టర్ కార్యక్రమాలు, మీడియా ప్రతినిధుల సమన్వయంలో సమాచార శాఖది కీలక పాత్ర అన్నారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో సమర్ధవంతంగా పనిచేసినప్పుడు ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించిన అసిస్టెంట్ డైరెక్టర్ భాస్కరనారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు తను సమర్థవంతంగా సేవలందించడంలో అధికారులు ఎంతో సహకరించారని ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రభుత్వానికి సమాచార శాఖకు మరింత పేరు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సమాచార శాఖ విజయవాడ డివిజనల్ పిఆర్ ఓ ఆర్ ఎస్ రామచంద్రరావు సిబ్బంది వివి ప్రసాద్ సిహెచ్ జాక్సన్ బాబు జెవి లక్ష్మి యం. సురేష్ బాబు కె. గంగాభవాని ఎస్ యశోద బి.రాంబాబు విజయప్రసాద్, నాగరత్నం తదితరులు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మహబూబ్ బాషాకు జ్ఞాపికను అందజేసి నూతన ఎడి యం. భాస్కరనారాయణను అభినందించారు.