Breaking News

లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే దీపం-2 పథకానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీపం-2 పథకం క్రింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక 27వ డివిజను ఇనగుదురు పేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులతో కలిసి లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ గావించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి మహానాడులో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే పథకానికి దీపావళి సందర్భంగా శ్రీకారం చుట్టినట్లు తెలిపారు రాష్ట్రంలో 1.08 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, వీరికి ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పున, ప్రభుత్వం ఏడాదికి 3 వేల కోట్ల రూపాయల వ్యయం భరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ సామాజిక పింఛన్లు మూడువేల నుండి 4 వేలకు ఒకేసారి పెంపు చేయడం, రాష్ట్రంలో 5.40 కోట్ల జనాభా ఉంటే, 65 లక్షల మందికి పింఛన్లు అందించడం సామాన్యమైన విషయం కాదన్నారు., హర్యానా రాష్ట్రంలో 2500 ఇస్తున్నారని, మన రాష్ట్రంలో పింఛన్లకు ఏడాదికి 33,000 కోట్లు వ్యయం భరిస్తూ ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. పేదల పాలిట అన్నపూర్ణగా గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్ లను ముఖ్యమంత్రి పునః ప్రారంభించారని అన్నారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు త్వరలో అందించినట్లు, పేదలకు కేవలం ఒక సెంటు కాకుండా, రెండు సెంట్లు ఇచ్చి ఇళ్ళు నిర్మిస్తామన్నారు.

త్వరలో మెగా డీఎస్సీ ప్రకటించి 16,700 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు చదువుకున్న నిరుద్యోగులకు ప్రయోజనకరంగా త్వరలో మచిలీపట్నంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 9వ తేదీన జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఎంఎస్ఎమ్ఈ ప్రోగ్రాం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ దీపావళి సందర్భంగా దీపం 2 పథకం క్రింద ముఖ్యమంత్రి ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందించి ఏడాదికి 2500 రూపాయల లబ్ది చేకూరుస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ పూర్వం మహిళలు కట్టెల పొయ్యితో ఊపిరితిత్తులు ఆస్తమా వంటి వ్యాధుల గురవుతూ ఇబ్బంది పడేవారని, అలాంటి పరిస్థితుల్లో 1999లో ప్రభుత్వం దీపం పథకం ప్రవేశపెట్టిందన్నారు రాను రాను గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, ఈ దశలో మహిళలు పాత పద్ధతులకు వెళ్లకుండా ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. 2025 మార్చి 31 లోగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి గ్యాస్ సిలిండర్ ధర వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, నాలుగు నెలలకోసారి ఏడాదిలో మూడు సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు అన్నారు.

స్థానిక ప్రముఖ నాయకులు బండి రామకృష్ణ మాట్లాడుతూ మహిళలు ఎంతగానో సంతోషించే పధకం, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, ఇలియాస్ పాష ,సయ్యద్ ఖాజా, వెంకన్న, గోపు సత్యనారాయణ, తలారి సోమశేఖర్, అజీమ్ తదితర నాయకులతో పాటు, అధికారులు

బందరు ఆర్డిఓ కే స్వాతి, డీఎస్ఓ వి పార్వతి, నగర పాలక సంస్థ కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజు,
స్థానిక కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు

లబ్ధిదారు గృహాన్ని సందర్శించిన మంత్రి

అనంతరం మంత్రి లబ్ధిదారు మహమ్మద్ సుల్తానా గృహాన్ని సందర్శించి ఉచితంగా అందించిన గ్యాస్ సిలిండర్ స్టౌ వెలిగించి ప్రారంభించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *