Breaking News

సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పసుపులేటి వెంకటరమణ నటీనటుల సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఆయన కోరారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అసోసియేషన్ 1980 సంవత్సరంలో మొదలుపెట్టామని అప్పటినుండి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో సినీ కళాకారులు నాటక రంగ కళాకారులను ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు నిర్మించామని అంతేకాకుండా నటీనట్లకు గుర్తింపు కార్డులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని ఇండ్ల స్థలములు మొదలగు సదుపాయాలు ఏర్పాటు కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నామని అన్నారు. ఈ అసోసియేషన్ తరపున వైస్ ప్రెసిడెంట్ కొప్పుల అశోక్, వైస్ ప్రెసిడెంట్ కావ్య, సెక్రటరీ కొండిశెట్టి సురేష్ బాబు, సయ్యద్ జాఫర్, సత్య, శివ కుమారి అసోసియేషన్ కళాకారులు నాటక రంగ కళాకారులు సినీ కళాకారులు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *