Breaking News

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ కు ప్రాణ త్యాగం చేసిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు పొట్టి.శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్య క్రమాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర గృహా నిర్మాణం, సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి కొలుసు.పార్ధ సారధి అన్నారు. ఆయన జయంతి, వర్ధంతి కార్య క్రమాలను ప్రభుత్వం చేయటం లేదని ప్రతిపక్షాలు విమర్శించటం శోచనీయం అని మంత్రి విమర్శించారు. విజయవాడలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకుడు  గొట్టిపాటి.రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి.శ్రీరాములు స్వంత జిల్లా నెల్లూరుకు ఆయన పేరు పెట్టడం జరిగిందని, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మహా నీయుల సేవలకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహించటంలో ముందు ఉంటారని మంత్రి వివరించారు.

బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం
తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పార్టీ అధ్యక్ష పదవిని బలహీన వర్గాల వారికి ఇవ్వటం గొప్ప విషయమని మంత్రి అన్నారు. మంత్రి వర్గంలోను, ఇతర పదవులు కేటాయించటంలోనూ బీసీ లకు అధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి ఇచ్చారాని మంత్రి పార్ధ సారధి అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో లక్ష మందికి పార్టీ సభ్యత్వం ఉండాలని ముఖ్యమంత్రి లక్ష్యం పెట్టుకున్నారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మంత్రి పార్ధ సారధి విజ్ఞప్తి చేసేరు. శాసన సభ్యులు గద్దే.రామ్మోహన్ రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల.నారాయణ, గొట్టిపాటి.రామకృష్ణ, పార్టీ నాయుకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *