అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పరంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై కోర్టుల నుండి జారీ అయ్యే ధిక్కార కేసులు(కంటెంప్టు ఆఫ్ కోర్టు)పై ఆయా శాఖల అధికారులు సకాలంలో స్పందించి వకాలత్ లు ఫైల్ చేయడం,అఫీళ్ళకు వెళ్లడం వంటి చర్యలను యుద్ద ప్రాతిపదిక చేపట్టి ప్రభుత్వం వాదనన కోర్టులు దృష్టికి తీసుకువెళ్ళాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు.సోమవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం కాన్పరెన్సు హాల్లో వివిధ శాఖల కార్యదర్శులతో ఆయన కంటెంప్టు కేసులపై సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కోర్టులు జారీ చేసే ధిక్కార కేసుల్లో సంబంధిత శాఖలు సకాలంలో స్పందించి వకాలత్ లు ఫైల్ చేయడం ద్వారా ప్రభుత్వ వాదనను కోర్టుల దృష్టికి తీసుకువెళ్ళలేక పోవడంతో ప్రభుత్వ అధికారులపై కోర్టులు సీరియస్ అవ్వడమే కాకుండా ఒక్కోసారి ఆయా అధికారులు కోర్టులకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించడం జరుగుతోందని గుర్తు చేశారు.ఇకమీదట అలాంటి పరిస్థితులకు ఆస్కారం లేకుండా ధిక్కార కేసులు వస్తే తక్షణం స్పందించాలని కార్యదర్శులను సిఎస్ ఆదేశించారు. కోర్టు ధిక్కార కేసులకు సంబంధించి ఏవిధంగా మెరుగైన చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలో అడ్వకేట్ జనరల్,ప్రభుత్వ ప్లీడర్లు,సహాయ ప్రభుత్వ ప్లీడర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని న్యాయశాఖ కార్యదర్శిని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ ఆదేశించారు.ధిక్కార కేసులకు సంబంధించి ఏవిధమైన తక్షణ చర్యలు తీసుకోవాలనే దానిపై అన్ని శాఖలకు వెంటనే మార్గదర్శకాలను జారీ చేయడనున్నట్టు ఆయన తెలిపారు.
న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి సుమారు 8వేల వరకూ కోర్టు ధిక్కార కేసులు నమోదు కాగా అవి వివిధ దశల్లో ఉన్నట్టు తెలుస్తోందని వివరించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్,పూనం మాలకొండయ్య,సతీష్ చంద్ర,కరికాల వల్లవన్,అనంతరాము,ప్రవీణ్ కుమార్,ముఖ్య కార్యదర్శులు కృష్ణబాబు,ఎఆర్ అనురాధ,వి.షారాణి, జయలక్ష్మి,శశిభూషణ్ కుమార్, బి.రాజశేఖర్, కె.సునీత,వాణి మోహన్,ఇంకా పలు శాఖల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …