Breaking News

కోడెలకు టీడీపీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది

-కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదు
-కోడెల విగ్రహం దొంగచాటుగా పెట్టాల్సిన అవసరం లేదు
-ఘనంగా కోడెల విగ్రహాన్ని అందరి సమక్షంలో ఆవిష్కరిస్తాం – మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కోడెల చేసిన సేవలు వెల కట్టలేనివని పేర్కొన్నారు. కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదని ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో కోడెల అంటే తెలియని వారు ఎవరూ లేరని అలాంటి మహా నాయకుడి విగ్రహాన్ని దొంగచాటుగా అర్థరాత్రులు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని అన్నీ అనుమతులతో జిల్లా నాయకులందరి సమక్షంలో గౌరవప్రదంగా ప్రతిష్టిద్దామని పేర్కొన్నారు. అయితే కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు ప్రవర్తించిన సహించేది లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *