విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు డా.డి.వి.జి. శంకరరావు, రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ అధ్యక్షతన కమిషన్ సభ్యులుతో రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్, విజయవాడ కార్యాలయములో సమావేశము నిర్వహించటము జరిగినది. ఈ సందర్బంగా కమిషన్ క్షేత్ర స్థాయి లో జరిపిన పర్యటనలయందు కమిషన్ దృష్టికి వచ్చిన పలు గిరిజనుల సమస్యలను చర్చించి కమిషన్ సిఫార్సులను చేయటము జరిగినది. గతంలో ఉన్న G.O. Ms. No.03 వలన గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు సానుకూల ఫలితాలు పొందారు. తదనంతరం, సదరు ఉత్తర్వులను సుప్రీం కోర్టు రద్దు చేసినందున దానికి బదులుగా గిరిజనుల సంక్షేమం కొరకు క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించుటకు కమిటీని ఏర్పాటు చేయవలసినదిగానూ మరియు ఆధార్ కార్డ్ లేని కారణముగా గిరిజన విద్యార్ధులకు విద్యాసంస్థలలో ప్రవేశానికి అవకాశము లేనట్లుగా కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. కావున ఆధార్ కార్డ్ లేనప్పటికి గిరిజన విద్యార్ధులకు విద్యాసంస్థలలో ప్రవేశానికి అవకాశము కల్పించవలసినదిగా పత్రికాముఖముగా కమిషన్ కోరుతున్నది. మరియు ఆధార్ కార్డ్ జారిలో ఉత్పన్నమైన సమస్యలను పరిస్కరించుటకు, ఆధార్ కార్డ్ లేని వారికి కొత్త కార్డ్ లు ఇచ్చుటకు ఆధార్ డ్రైవ్ ఏర్పాటు చేయుటకు ప్రత్యేక చర్యలు చేపట్టవలసినదిగా కోరతూ, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వారికి లేఖ వ్రాయటము జరిగినది. ఈ విషయాలపై గౌరవ రాష్ట్రపతి, భారత ప్రభుత్వం వారిని కలిసి గిరిజన సమస్యలు విన్నవించుటకు అపాయింట్మెంట్ కొరుటకుగాను సమావేశములో తీర్మాణము చేయడ మైనది.
ఈ కార్యక్రమములో రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ డా.డి.వి.జి.శంకరరావు, కమిషన్ సభ్యులయిన వడిత్య శంకర్ నాయక్, జంపరంగి లిల్లీగారు, శ్రీ చిచ్చడి మురళి, కొర్ర రామలక్ష్మి. మరియు సెక్రెటరీ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News