Breaking News

జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చే పనులు వేగవంతం చేయాలి

-పనుల నాణ్యతలో రాజీ పడవద్దు-కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో గుంతలు లేని రహదారుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో ఆర్ అండ్ బి అధికారులు, గుత్తేదారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం వేగవంతం చేయాలని,  పనులు సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు త్వరగా వచ్చేలా కృషి చేస్తామన్నారు. అధికారులు కూడా గుత్తేదారుల బిల్లులు ఆపవద్దని సూచించారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లింపుల్లో సి ఎఫ్ ఎం ఎస్ సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లను అధికారుల చుట్టూ తిప్పుకోవద్దని,  పనులకు సంబంధించిన అగ్రిమెంట్ నిబంధనల మేరకు నాణ్యతగా పనులు చేయాలని, పనుల నాణ్యతలో రాజీ పడవద్దని కలెక్టర్ సూచించారు. జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్ లోకేష్ డీఈలు ఎస్. సంగీత, డి. బలరాం, ఎం. రమేష్, పలువురు గుత్తేదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *