Breaking News

ఉపాధి అవకాశాలు, ప్లేస్మెంట్ సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జి.గణేష్ కుమార్, ఐఏఎస్ MD&CEO,Director,Technical Education, Director Employement &Trg, ఈరోజు తిరుపతిలోని SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ విచ్చేసి అక్కడ జరుగుతున్నటువంటి పీఎంకేవై 4.0, స్కిల్ హబ్ శిక్షణ సెంటర్ ని విజిట్ చేసి అక్కడ యువతతో ఇంట్రాక్ట్ అయి శిక్షణ జరుగుతున్నటువంటి విధానము అలాగే వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని వాళ్లకి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది, అలాగే శిక్షణ ఇస్తున్నటువంటి ట్రైనరు, ప్రిన్సిపల్, డిఎస్డిఓ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని వారు తగు సూచనలు సలహాలిచ్చి క్వాలిటీ ట్రైనింగ్ జరగాలని అలాగే అందరు బాగా నేర్చుకొని, శిక్షణ పూర్తి చేసుకున్నాక ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు, ప్లేస్మెంట్ కల్పించి వారి జీవితాన్ని సద్వినియోగం చేసుకొని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

తర్వాత ఈపర్యటనలో భాగంగా ఏపీ ఎస్ ఎస్ డి సి ద్వారా, NAC శిక్షణ కేంద్రంలో, మెడికల్ కాలేజీకి ఆపోజిట్ వెళ్లి, తిరుపతి సెంటర్, అక్కడ పిఎం విశ్వకర్మ పథకం సంబంధించి మూడు బ్యాచులు శిక్షణ, మాసన్(Masan),వాటర్ వాషింగ్ దోబి, పై ఆరు రోజులు శిక్షణ జరుగుతున్నటువంటి విధానాన్ని పరిశీలించి వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చి వారందరి యొక్క, అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని సెంట్రల్ గవర్నమెంట్ కి, పంపించి, తగు చర్యలకు సంబంధించి తెలియజేస్తానని ఈక్కడ ముఖ్యంగా శ్రామిక కార్డు, ఇన్సూరెన్స కార్డు, చేతివృత్తుల పెన్షన్ కి సంబంధించి, బ్యాంకు రుణ సదుపాయాలు ఇలాంటి వాటిపైన ఫీడ్బ్యాక్ను ఎండి కి శిక్షణ పొందుతున్నటువంటి పీఎం విశ్వకర్మ అభ్యర్థులు తెలియజేశారు.. దాని పై తగు చర్యలు తీసుకొని పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా ఎండి  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి వాషర్ మెన్ ధోబి చేతి వృత్తి మహిళలకు 50 మందికి సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ దినేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ ఎస్ఎస్డిసి మరియు ఏడిజి NAC , ద్వారకనాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్, ఎస్ వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వారు సిబ్బంది, విజయ్ ప్రతాప్, రీజనల్ హెడ్,NAC ,ఆర్. లోకనాథం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, సతీష్ కుమార్, ఏడి,NAC, ఏపీ ఎస్ ఎస్ డి సి,NAC ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *