Breaking News

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకి ఎటువంటి సౌకర్యం కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా మాచవరం పరిసర ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండపై నుంచి వచ్చే వ్యర్థాలన్ని కింద పేరుకుపోవడం గమనించి, వెంటనే డిసిల్టింగ్ పనులను మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని రోడ్డు పై ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మూత సరిగ్గా లేకపోవడం గమనించి సత్వరమే మూతను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రజలు ఎటువంటి అసౌకర్యాలు చూసుకోవాలని నిత్యం పరిస్థితిని నిర్వహణ సక్రమంగా జరిపిస్తూ భూగర్భ డ్రైనేజీ పొంగకుండా చూసుకోవాలని, అధికారులను ఆదేశించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *