Breaking News

మంత్రి కొలుసు పార్థసారథి మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ నెల నవంబర్ 8వ తేదీ నుండి 10 వ తేదీ వరకు మూడు రోజులు తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 వ తేదీ విజయవాడ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రి 10 గం.లకు తిరుమల చేరుకుంటారు. 9వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కు 12 గం.లకు చేరుకుని 2 గం.ల వరకు చిత్తూరు ఉమ్మడి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులతో మరియు సంబంధిత అధికారులతో గృహ నిర్మాణ శాఖ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.20 గం.లకు రామచంద్రపురం మండలం, సి రామాపురం హౌసింగ్ లేఅవుట్ కు చేరుకుని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడుతారు. అనంతరం అక్కడ నుండి బయల్దేరి రాత్రికి తిరుమలలో బస చేస్తారు. మరుసటి దినం 10వ తేదీ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడకు రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం కానున్నారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *