– ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలి.
– బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డీఎస్‌సీ-ఎస్‌జీటీ పరీక్షకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందించే ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌టీఆర్ జిల్లా ఏపీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎన్‌టీఆర్ జిల్లాకు చెందిన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా పొందిన దరఖాస్తుకు బయోడేటా; కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, టీసీ, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, టెట్ మార్కుల జెరాక్సు కాపీలను సమర్పించాలని సూచించారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించకూడదన్నారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపికచేసి 60 రోజులపాటు ఉచితశిక్షణతో పాటు స్టైపెండ్, స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ఏదైనా సందేహం ఉంటే విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్‌ను సంప్రదించాలని కె.శ్రీనివాసరావు సూచించారు.
Prajavartha Online Telugu News