Breaking News

సింబల్‌ లేకుండా పోటీ చేద్దాం.. సిద్ధమా… : మాజీ మంత్రి జోగి రమేష్‌

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం నియోజకవర్గంలో సహజ వనరులను నాడు వైసీపీలో నేడు టీడీపీలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ లూఠీ చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే వసంత చేసిన ఆరోపణలకు జోగి కౌంటర్‌ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ చేసింది. బూడిద దోచుకుంటుంది మైలవరం వీరప్పన్‌ కృష్ణప్రసాద్‌ కాదా? అని ప్రశ్నించారు. సహజ వనరులను దోచుకుంటున్న కృష్ణప్రసాద్‌ను నియోజకవర్గ ప్రజలు క్షమించొద్దని, ఆయనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వీరప్పన్‌తో తిరుగుతున్న టీడీపీ నాయకులు ఆయన కోసం మీడియా సమావేశాలు పెట్టొద్దని, మీ స్థాయికి తాను దిగలేనని హితవు పలికారు. మైలవరంలో ఒక్క సమావేశంతోనే ఎమ్మెల్యే వసంత బెంబేలెత్తిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీలో తాను మంత్రిగా, కృష్ణప్రసాద్‌ ఎమ్మెల్యేగా ఉన్నా జోగి నామస్మరణ మరువలేదన్నారు. వసంత గురించి మాట్లాడానంటే స్థాయిని దిగజార్చుకుని మాట్లాడానన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు, దొంగ కోళ్లు పట్టే వాడికి తేడా లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో వైన్స్‌ షాపులు పెట్టుకుంటే మీకు కమీషన్లు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. గతంలో కృష్ణప్రసాద్‌ ఏడుస్తున్నారనే తాను మైలవరం నియోజకవర్గానికి ఏనాడూ రాలేదన్నారు. వసంత అక్రమాలపై మీడియా సమక్షంలో చర్చకు వచ్చే దమ్ముందా? అని సవాల్‌ విసిరారు. మాజీ ఎంపీ ఉపేంద్ర ఇంటి ముందు సీటు కోసం ఘర్షణకు దిగిన తండ్రి కొడుకులు సంస్కారం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఒక్క మాటతో సీటు త్యాగం చేసి వెళ్ళానని, తనను డబ్బుతో కొంటావా? అంత దమ్ముందా? అని ప్రశ్నించారు. 2027 తరువాత వసంత కృష్ణప్రసాద్‌ చాప, దిండు సర్దుకుని నియోజకవర్గం నుంచి పారిపోతాడని జోగి జోస్యం చెప్పారు. టీడీపీని పొడిచి వైసీపీలో చేరాడని, వైసీపీని పొడిచి టీడీపీలో చేరాడని, మళ్లీ టీడీపీని పొడవడనే గ్యారెంటీ? ఏమిటని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో బూడిద అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే కార్యాచరణ రూపొందించి పోరాడతామని హెచ్చరించారు. నాలుగు నెలల్లోనే కూటమి పార్టీలు ఏ విధంగా రోడ్డున పడ్డాయో చూస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని సీఎం చంద్రబాబును సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ అన్నారంటే అర్ధం చేసుకోవచ్చని చెప్పారు. ఇక నుంచి తాను ఎమ్మెల్యేను డీకేపీ (దొంగ కోళ్లు పట్టేవాడు) అని అంటానన్నారు. తాను జగన్‌ను ఒప్పిస్తా.. వసంత కూటమి నుంచి బయటకు వస్తాడా? పార్టీ సింబల్‌ పై కాకుండా స్వతంత్రంగా పోటీ చేద్దాం.. సిద్దమా? అని సవాల్‌ విసిరారు. రాజధాని మారితే రాజీనామా చేస్తానని.., చనిపోయే వరకు జగన్‌ వెంటే ఉంటానన్న ఎమ్మెల్యే వసంత మాటమీద నిలబడ్డాడా అని ప్రశ్నించారు. సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *