-పోటీలో పాల్గొనడమే విజయం
-క్రీడల పరిశీలకులుగా వి కె ఆర్ తంబి
-జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె. వాసుదేవరావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థి దశ నుండీ పోటీ తత్వాన్ని అలవరచుకోవాలని , పోటీలో పాల్గొనడమే విజయం అని జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె వాసుదేవరావు అన్నారు. శనివారం స్థానిక ఎస్ కె వి టి డిగ్రీ కళాశాల క్రీడా మైదానం లో 68 వ అంతర్ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్ ప్రారంభించారు.
ఈ ఈ సందర్భంగా వాసుదేవ రావు మాట్లాడుతూ , బాల్ బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తాను తూర్పుగోదావరి జిల్లా లో ఏ పాఠశాల కు విజిట్ కు వెళ్లినా ఒకో ఆటలో ఒక విజేత కనిపించడం చాలా ఆనందం గా ఉందన్నారు. అక్కడి విజయగాధలు వ్యాయామ ఉపాధ్యాయుల కృషిని తెలుపు తున్నాయని, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు అందరినీ అభినందిస్తున్నానన్నారు. ఆటల పోటీల లో సాధించిన సర్టిఫికెట్స్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు ఉపకరిస్తాయన్నారు. మీరు ఎంచుకున్న ఆట ను దీక్ష తో కూడి ఆడాలన్నారు. ఆరోగ్యానికి కూడా ఆటలు ఎంతో ఉపయుక్తం అన్నారు. పోటీతత్వం తో ముందుకు వెళ్లి, ఉన్నతికి రావాలని, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించలన్నారు.
68 వ అంతర్ జిల్లాల బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు రాష్ట్రం లోని 13 జిల్లాల నుండీ 13 బ్యాచ్ లు పోటీకి వచ్చాయని, రెండు రోజులు పాటు ఈ పోటీలు జరుగుతాయని సభాధ్యక్షులు, అర్బన్ రేంజ్ డి ఐ. బి. దిలీప్ కుమార్ తెలిపారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయిని రమాదేవి వ్యాఖ్యాత గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర స్థాయి పరిశీలకులు తంబి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు ఏ వి డి ప్రసాద్,నాగరాజు, ఎస్ కె. వి టి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్ వి ఎమ్ సుబ్రహ్మణ్యం, సింహద్రి ,ధనరాజ్, ఇబ్రహీం, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డి, వీరన్న , డేవిడ్ ,ప్రకాష్ ,బాల సుంకయ్య గారు ,వెంకట్ ,శ్రీనుబాబు, లక్ష్మి, సత్యవేణి, అన్నపూర్ణ, పరిమళ, సౌజన్య , ఇతర వ్యాయమ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News