విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పరిశుభ్రతకు గృహ యజమానులందరూ సహకరించాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 36 వ డివిజన్ సీతన్నపేటలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థ పదార్ధాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతపై గృహ యజమానులకు శాసనసభ్యులు వివరించారు. ఈ అవగాహనను శానిటేషన్ సిబ్బంది ప్రజలందరికీ కల్పించాలని సూచించారు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే నగరం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఇంటింటికీ వెళ్లి గృహ యజమానులకు 3 రకాల చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. నగర ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా, ఈ చెత్త బుట్టలను వినియోగించి నగర పరిశుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ క్లాప్(క్లీన్ ఆంధ్రప్రదేశ్) కార్యక్రమాన్ని మోడల్ డివిజన్ లుగా 27, 36 వ వార్డులలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ప్రతిరోజు 500 టన్నులకు పైగా చెత్త బయటకు వస్తుందని.. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఇంటి పన్నుపై విపక్షాలు అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మల్లాది విష్ణు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తెలుగుదేశం నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల అంశంపై ప్రజలకు ఖచ్చితమైన అవగాహన కల్పించడంతో పాటు వారి అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళతామని వెల్లడించారు. కౌన్సిల్ లోనూ కూలంకషంగా చర్చిస్తామన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న నీచ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పుల్పా కృష్ణ, ఇమిడి రాము, గడ్డం ఆర్కే, రాజేష్, దుర్గారావు, పఠాన్ భూపతి, రమణ, వైసీపీ శ్రేణులు, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …