రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు
-ఎయిర్ పోర్టు ఆధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 9 అంశాలపై అధ్యయనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో అదనంగా మరో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధిలో భాగంగా.. ఆ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం రూ.2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలు ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రతిపాదిత ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని, కార్గో సేవలను పెంచడం ద్వారా ప్రయాణీకులకు మరింత విస్తృతంగా సేవలు అందించాలన్న ఆలోచన సాకారం అవుతుందన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సాధ్యాసాధ్యాలపై ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు.
దీంతో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదిత ఎయిర్ పోర్టుల అభివృద్ధికి తగిన భూమి గుర్తించి, నివేదికలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దీనికి సంబంధించి కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జున సాగర్ – 1670 ఎకరాలు, తాడేపల్లి గూడెం – 1123 ఎకరాలు, శ్రీకాకుళం – 1383 ఎకరాలు, తుని – అన్నవరం – 787 ఎకరాలు, ఒంగోలు – 657 ఎకరాలు ఎయిర్ పోర్టు అభివృద్ధికి తగిన భూమి అందుబాటులో ఉన్నట్లు కలెకర్ట్ ల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదికను అందించడం జరిగింది.
అనంతరం ప్రతిపాదిత 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి గుర్తించిన భూమిలో సాధ్యాసాధ్యాలపై ముందస్తు అధ్యయనంకు ప్రాథమికంగా 9 అంశాలకు సంబంధించి, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒక సాంకేతిక కమిటీ, అక్కడ అధ్యయనం చేయనుందన్నారు.. ఈ అధ్యయనంలో 9 అంశాలు (ప్రతిపాదిత భూమిలో WGS – 84 వ్యవస్థ, రెవెన్యూ మ్యాప్, ప్రతిపాదిత భూమి లైన్ డైయాగ్రమ్ స్కెచ్, ప్రతిపాదిత భూమి విండోర్స్ డయాగ్రమ్, కాంటూర్ మ్యాప్, ప్రతిపాదిత సైట్ లో ప్లాన్ చేయబడిన క్రిటికల్ ఎయిర్ క్రాప్ట్ టైప్, 1:50000 లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్, గత 10 ఏళ్లలో మెటలార్జికల్ డిపార్ట్ మెంట్ డేటా, టైప్ ఆఫ్ ఆఫరేషన్స్ డిసైర్డ్ – (VFR) or (IFR) ) ప్రతిపాదిత ఎయిర్ పోర్టు ప్రాంత అభివృద్ధికి సంబంధించిన భూమిలో అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనం చేయడానికి ఒక్కో ఎయిర్ పోర్టుకు రూ. 37.87 లక్షలు ఖర్చు అవుతోందని.. మొత్తంగా ఈ 6 ఎయిర్ పోర్టులకు కలిపి దాదాపుగా రూ. 2.27 కోట్లు వ్యయం అవుతోందన్నారు.. ముఖ్యమంత్రి సూచనల మేరకు మొత్తంగా రూ. 2.27 కోట్లతో ఈ 6 ఎయిర్ పోర్టుల అభివృద్ధికై సాధ్యాసాధ్యాల అధ్యయనం చేయడానికి నిధులు కేటాయించినట్లు మంత్రి తెలియజేయడం జరిగింది. ఈ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ఒక నిర్ణయానికి రానుంది.
మరోవైపు ఇప్పటికే నెల్లూరు (దగదర్తి) ఎయిర్ పోర్టుకు సంబంధించి, ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తగిన భూమి కోసం అధ్యయనం చేయడం, కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది.. మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో కీలకమైన 7 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల నిర్మించాలన్న, కల అతి త్వరలో సాకారం కావడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమ‌వారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *