విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తామని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) తెలిపారు. తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విఎంసి, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, మరియు షేక్ రాజా హాస్పటల్ వైద్యులతో సమీక్ష జరిపారు. పశ్చిమ లో నెలకొన్న సమస్యలు, అత్యవసర అభివృద్ధిపై చర్చించారు. పశ్చిమంలోని పార్కులు, డ్రైనేజీలను అభివృద్ధి మరియు తాగునీటి సమస్యల సవాళ్లను అధిగమించి పరిష్కార మార్గాల కోసం పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు.. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు . జీఐఎస్ సిస్టమ్ ద్వారా అన్ని ప్రాంతాల సమస్యలు, అభివృద్ధి ప్రణాళికల సాధ్యాసాధ్యాలను చర్చించారు.. వెస్ట్ లోని పార్కుల నిర్వహణ పై పూర్తి వివరాలను కోరారు.. కన్సల్టెన్సీ సంస్థ సహకారంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News