Breaking News

ఎమ్ సి సి బృందాలకు శిక్షణ

-డి ఆర్వో టి. సీతారామమూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా రెవెన్యు అధికారి టి. సీతారామమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్ సి సి బృందాల శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి. సీతారామమూర్తీ మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన గుర్తించడంలో ప్రతికల్లో, ఫిర్యాదులు వస్తున్న వాటినీ పరిగణన లోనికి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సీ విజల్ విధానంతో కాకుండా ఫిర్యాదులు ఆధారంగా ఎమ్ సి సి బృందాలు ఉల్లంఘన గుర్తించి, ఆయా అభ్యర్థులకు నోటీసు ఇవ్వాలని తెలియ చేశారు. ఎమ్ సి సి మార్గదర్శకాల నియమావళి పుస్తకాలు ఇవ్వడం తో పాటు మాస్టర్ ట్రైనర్ ద్వారా అవగాహన కల్పించడం, సందేహాల నివృత్తి చెయ్యడం కోసం ఈ శిక్షణా తరగతులను నిర్వహించినట్లు తెలియ చేశారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ఎంపిడివో లు, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం, కళ్యాణం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా శివరాత్రిని పురస్కరించుకొని 26.02.2025 బుధవారం రాత్రి మల్లేశ్వర స్వామి వారి ఆలయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *