Breaking News

ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించే పార్టీ తెలుగుదేశం

-శాసననభ్యులు గద్దె రామమోహన్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశంలో జాతీయ రాష్ట్ర స్థాయిల్లో అనేక పార్టీలు ఉన్నాయని, వాటిల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి నాయకత్వాన్ని ఎన్నుకునే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీయేనని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు.
బుధవారం ఉదయం 7వ డివిజన్ మొగలరాజపురం శాంతినగర్ ప్రాంతంలో జి.వి.ఎస్. శర్మ కుటుంబ సభ్యులు ఐదుగురు రూ.5 లక్షలు చెల్లించి తెలుగుదేశం పార్టీ జీవితకాల సభ్యత్వాన్ని గద్దె రామమోహన్ మరియు గద్దె క్రాంతికుమార్ చేతుల మీదగా తీసుకున్నారు. శాసనసభ్యులు గద్దె రామమోహన్ వారింటికి స్వయంగా వెళ్లి ఆన్‘లైన్‘లోని టి.డి.పి. వెబ్‘సైటు ద్వారా వారికి సభ్యత్వ కార్డులను అందజేశారు. సభ్యత్వం తీసుకున్న వారికి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని గద్దె రామమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జి.వి.ఎస్. శర్మ మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం పార్టీ జీవిత కాల సభ్యత్వం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *