ధవళేశ్వరంలో కూటమి అభ్యర్థులకు ఘన విజయం అందించాలి: దేవినేని ఉమా

-20వ డివిజన్ అభ్యర్థి అశ్విని, మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవికి మద్దతుగా ఎన్నికల ప్రచారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధవళేశ్వరం పరిధిలోని 20వ డివిజన్‌లో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20వ డివిజన్ కూటమి అభ్యర్థి శ్రీమతి అశ్విని, మేయర్ అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవిని ప్రజలకు పరిచయం చేస్తూ, వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి, రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి ప్రజలు తమ మద్దతు అందించాలని కోరారు. ధవళేశ్వరం 20వ డివిజన్‌లో సైకిల్ గుర్తుతో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజల ఆశీస్సులతో రాజమహేంద్రవరం నగరంలో కూటమి జెండా ఎగురవేయాలని దేవినేని ఉమా పిలుపునిచ్చారు