Breaking News

స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయడం ద్వారా క్రీడాకారులను

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించి, క్రీడాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానికంగా స్టేడియం నిర్మాణ పనులు వేగవంతం గావించాలని, క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేడియం వద్ద షాపులు నిర్మించి జిల్లా క్రీడాధికార సంస్థకు ఆదాయ వనరులు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలన్నారు.
డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీని ఆర్థికంగా పటిష్టం చేసేందుకు పంచాయతీల ద్వారా పన్నుల వసూళ్లలో 3 శాతం స్పోర్ట్స్ సెస్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఖాతాకు జమ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిపిఓ ను కలెక్టర్ ఆదేశించారు. కమిటీ వైస్ చైర్మన్, జిల్లా ఎస్పి ఆర్. గంగాధర్ రావు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు శాఖ పరంగా తమ వంతు సహకారం అందిస్తామని, క్రీడారంగంలో కృష్ణాజిల్లా అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. తొలుత సమావేశంలో కమిటీ సభ్య- కన్వీనర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కే. ఝాన్సీ లక్ష్మి అజెండా అంశాలు వివరించారు. ఇండోర్ స్టేడియం వద్ద ప్రహరీ నిర్మాంచవలసిన అవసరం ఉందని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కమిటీ సభ్యులు డిఎం అండ్ హెచ్ వో డాక్టర్ జి గీతా బాయి, డిపిఓ ఎస్ వి నాగేశ్వర నాయక్ , జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎస్. కిషోర్ కుమార్, ఎన్. గాయత్రి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కే. వెంకట్రావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *