విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో బీసీ కార్పొరేటర్లకు పూలే అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. బీసీఐ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్వీ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇటీవల ఎన్నికైన బీసీ కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎన్వీ రావు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తితో ప్రజలకు సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పదవులు శాశ్వతం కావని, ప్రజలకు చేసే సేవలే చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యాభివృద్ధి ద్వారానే పూలే ఆశయాలు నెరవేరుతాయని తెలిపారు.
ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ప్రారంభ ఉపన్యాసం చేయగా, సీనియర్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, అడ్డూరి శ్రీరామ్, ప్రముఖ ఇంజనీర్ టీ. సోమనాద్రి తదితరులు ప్రసంగించారు. బీసీలంతా ఐక్యంగా ఉంటూ సేవాభావంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సోమనాద్రి పిలుపునిచ్చారు.
అనంతరం పూలే విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు ఆధ్వర్యంలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది.
అవార్డులు అందుకున్న వారిలో అడ్డూరి శ్రీరామ్ (49వ డివిజన్), ఉమ్మడి వెంకటేశ్వరరావు (48), ఆవాల అర్జున్ సాయి (40), చెరుకు బొమ్మ (33), బేవర జోగేశ్వరరావు (44), అత్తలూరు నాగ వెంకట సంతోష్ కళ్యాణి (45), పెద్దిరమేష్ (55), కొంచెం శ్యామల (46), ఈగల సాంబశివరావు (47), పిట్లల గోవింద్ (59), మాచర్ల పావని (63), మట్ల రవీంద్ర (66), ఎరుబోతు సుజాత (73), గొరిపర్తి నామేశ్వరరావు (30), దుంగ సంగీతలక్ష్మి (5), లబ్బీ దుర్గ (84), ఒట్టే వెంకటేశ్వరరావు (85), దాసరి ఉదయశ్రీ (82), కేంబూరి భవాని (67), గౌసియా షేక్ (79), కుమ్మర నాగేశ్వరరావు (26) తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఏ.ఎస్. కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ వి.వి. సుబ్బారావు, టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రిబోతు రమణ, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవాది కూర్మాచారి, బీసీ నాయకులు ధన్వంతరి, మురిపాల దుర్గారావు, న్యాయవాదులు పిల్లా రవి, పిల్లా శ్రీనివాసరావు, కనిశెట్టి లక్ష్మణరావు, కర్బుక్త ప్రకాష్ రావు, గంటా శ్రీనివాసరావు, బుద్ద నాగేశ్వరరావు, బాడిషా అరుణ సీత, మాజీ కార్పొరేటర్ సాయి, వేముల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
