విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు . నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా, తూకంలో తేడా ఉన్నా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ …
Read More »Andhra Pradesh
అఖిల భారత సివిల్ సర్వీస్ చదరంగ పోటీల విజేతలను సత్కరించిన రజత్ భార్గవ
అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 10వతేదీ నుండి 17వతేదీ వరకూ ఢిల్లీల్లో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ చదరంగం పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొని ద్వితీయ స్థానం పొంది రజత పతకాన్ని సాధించిన బృందాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ (ఎక్సైజ్ అండ్ స్టాంప్స్ మరియు రిజిష్ట్రేన్స్) రజత్ భార్గవ సత్కరించారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులోని ఆయన చాంబరులో ఈబృందాన్ని రజత్ భార్గవ దుస్సాలువ, జ్ణాపికలతో ఘణంగా సత్కరించారు.అఖిల భారత సివిల్ సర్వీస్ చదరంగ పోటీల్లో పాల్గొని ద్వితీయ …
Read More »వేసవిలో మంచినీటి సరఫరా లో ఇబ్బంది కలుగకుండా చూడాలి..
-పారిశుధ్యo మెరుగుదలకై అధికారులకు ఆదేశాలు — కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా బుధవారం అధికారులతో కలసి లోటస్ ల్యాండ్ మార్క్, కేదారేశ్వర పేట, పెజోన్నిపేట, బాప్టిస్ పాలెం తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు అందించు మంచినీటి సరఫరా విధానముపై స్థానిక ప్రజలను ఇబ్బందులను అడిగితెలుసుకొన్నారు. ముందుగా లోటస్ ల్యాండ్ మార్క్ నందు 14వ ఆర్దిక సంఘ నిధులతో చేపట్టిన రోడ్లు, డ్రెయిన్ లను …
Read More »కృష్ణాజిల్లా లోనే అతిపెద్దదీ ‘ కరగ్రహారం జగనన్న కాలనీ లే అవుట్ ‘… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం కరగ్రహారం వైయస్సార్ జగనన్న కాలనీ లే అవుట్ జిల్లాలోనే అతిపెద్దగా వెలసిందని,ఇక్కడ 316 ఎకరాల్లో 15,998 మంది ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి శాశ్వత నివాసానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన కరగ్రహారం వైయస్సార్ జగనన్న కాలనీ లే అవుట్ వద్దకు విచ్చేసి వివిధ …
Read More »శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో తాతినేని పద్మావతి
మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ.పి.యస్.ఆర్.టి.సి విజయవాడ జోనల్ చైర్మన్ తాతినేని పద్మావతి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పద్మావతికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ పండితులు వేద మంత్రోర్చనల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్ పద్మావతిని ఆలయ సూపర్నెండెంట్ అచ్యుత మధుసూదనరావు …
Read More »మాస శివరాత్రిని పురస్కరించుకుని శివయ్యకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరమశివునికి ప్రీతిపాత్రమైన మాస శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గవర్నర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన సర్వదేవతా హోమాలు, పూర్ణాహుతిలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని విఘ్నాధిపతికి ఆది పూజ నిర్వహించారు. అనంతరం వేద …
Read More »యాంటీ లార్వా ఆపరేషన్ డ్రైవ్ ను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి
-దోమల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ డ్రైవ్ ను వారం రోజుల పాటు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మలేరియా అధికారులు, శానిటేషన్ సెక్రటరీలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హై రిస్క్ ప్రాంతాలపై ఆరా తీశారు. ఆయా ప్రాంతాలలో పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని, ఫాగింగ్ ఆటోలు, హ్యాండ్ స్ప్రేయింగ్ యంత్రాలని …
Read More »ప్రజల సంక్షేమమే మా లక్ష్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో. పప్పులమిల్లు రోడ్డు, రఘురామ వీధి,పూర్ణచంద్రరావు రోడ్డు ప్రాంతంలో గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాల్గోవ రోజు జరిగిన కార్యక్రమం లో అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ …
Read More »విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నాం
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజల ఇబ్బందులను చూసి ప్రస్తుతం పాత చార్జీలు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మరింత దెబ్బ అని, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రో, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న తరుణంలో ఈ చార్జీల పెంపు తగదని అన్నారు. చార్జీలు తగ్గించని …
Read More »31న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు
-ఏప్రిల్ 7న విశాఖపట్నం లో రాష్ట్రస్థాయి నిరసన -ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రజలను దోచుకోవడానికే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. 8 సంవత్సరాల కాలంలో అక్షరాలా రూ. 26లక్షల కోట్లను ప్రజలనుంచి దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పెట్రో ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దోచుకెవడమే పరమావధిగా మారిందని ధ్వజమెత్తారు. …
Read More »