Breaking News

అఖిల భారత సివిల్ సర్వీస్ చదరంగ పోటీల విజేతలను సత్కరించిన రజత్ భార్గవ

అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 10వతేదీ నుండి 17వతేదీ వరకూ ఢిల్లీల్లో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ చదరంగం పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొని ద్వితీయ స్థానం పొంది రజత పతకాన్ని సాధించిన బృందాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రెవెన్యూ (ఎక్సైజ్ అండ్ స్టాంప్స్ మరియు రిజిష్ట్రేన్స్) రజత్ భార్గవ సత్కరించారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులోని ఆయన చాంబరులో ఈబృందాన్ని రజత్ భార్గవ దుస్సాలువ, జ్ణాపికలతో ఘణంగా సత్కరించారు.అఖిల భారత సివిల్ సర్వీస్ చదరంగ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించిన బృందంలో షేక్ తస్నీమ్ ఫైరుద్దుస్ (సి) (Shaik Tasneem Firddus)వార్డు మహిళా పోలీస్ గుంతకల్ (అనంతపురం జిల్లా), ఎన్.మంజుల (టాప్-5 వ్యక్తిగత విభాగం)సీనియర్ లెక్చిరర్,పల్లిపాడు(నెల్లూరు జిల్లా), సి.శ్రీవిద్య(వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రోసెసింగ్ సెక్రటరీ)(కదిరి-అనంతపురం జిల్లా), ఎమ్.యమున(బోర్డు ప్రైజ్ టాప్-9 ఇన్ ఇండియా)(ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాయకరావుపేట) (విశాఖపట్నం),పి.శివ శ్రీ(ఇంజనీరింగ్ అసిస్టెంట్ అన్నవరం,(తూర్పు గోదావరి జిల్లా).ఎపి సచివాలయం నుండి ఈబృందానికి మేనేజరుగా ఆర్.రమేశ్ బాబు,ఎ.వీర శేఖర్ కోచ్ గా వ్యవహరించారు. ఈ సత్కార కార్యక్రమంలో ఎపిటిడిసి చైర్మన్ వరప్రసాద్ రెడ్డి,సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి,ఇంకా సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి,సంయుక్త కార్యదర్శులు తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *