విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యా శాఖ,NCERT సంయుక్తం గా దేశ వ్యాప్తం గా 3 వ తరగతి విద్యార్ధులకు పునాది అక్షరాస్యత, సంఖ్యాత్మకత లో జాతీయ స్థాయి సాధన సర్వే(Foundational Learning Numeracy – National Achievement Survey) ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు నిర్వహిస్తోందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా పునాది స్థాయిలో ఈ అంశం మీద నిర్వ హించడం దేశంలో ఇదే మొదటిసారని …
Read More »Andhra Pradesh
ప్రభుత్వ పరంగా కార్మికులుగా గల సదుపాయాలపై సమగ్ర అవగాహన కలిగియుండాలి
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో APCOS ద్వారా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ESIC కార్పొరేషన్ మరియు మెడికల్ ఇన్సురెన్స్ సేవల పట్ల పూర్తి అవగాహన కల్పించాలనే లక్ష్యంగా గురువారం స్థానిక తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు ఉద్యానవన శాఖలో పని చేస్తున్న కార్మికులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీశైలజా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ …
Read More »ప్లాస్టిక్ రహిత, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దుటలో ప్రజలు భాగస్వాములు కావాలి
-విద్యార్ధులచే స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 పై అవగాహన ర్యాలీ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ్ సర్వేక్షణ్ పై ప్రజలలో అవగాహన కల్పించాలనే కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఎ.ఎస్ వారి ఆదేశాలకు అనుగుణంగా నేడు 39వ శానిటరీ డివిజన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్, D.S.M ఉన్నత పాఠశాల విద్యార్ధులచే నిర్వహించిన మెగా స్వచ్చ్ భారత్ ర్యాలి ని స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ తో కలసి ప్రారంభించారు. స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో మన …
Read More »బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని పెంచడం & గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం మెరుగుపరచడం PM-WANI లక్ష్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైమ్ మినిస్టర్స్ వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ (PM-WANI) ప్రాజెక్ట్ టెలికమ్యూనికేషన్ శాఖ (DoT), కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం యొక్క అంకురార్పణ జరిగింది. ఇంటర్నెట్ సౌకర్యo లేని ప్రాంతాలలో చివరి మైలు వరకు పరిష్కారాన్ని అందించడం ద్వారా బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని పెంచడం & గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం మెరుగుపరచడం PM-WANI లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంటర్నెట్ సేవల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, PM-WANI పబ్లిక్ డేటా ఆఫీస్ …
Read More »నగరంలో ఓకినోవా ఎలక్ట్రికల్ బైక్ షోరూం ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత తరుణంలో రవాణా చార్జీలు బాగా పెరిగిపోయాయి… పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతున్న పరిస్థితుల్లో దీనికి ప్రత్యామ్నాయంగా బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి… దీనిలో భాగంగానే ఓకినోవా బ్యాటరీ టూ వీలర్ వెహికల్స్ నగరంలో అందుబాటులోకి వచ్చాయి. ఏలూరు రోడ్, గుణదల లో అర్.అర్ ఇవి మోటార్స్, ఓకినోవా టూ వీలర్ బ్యాటరీ షోరూం ను తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »గవర్నర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయిన ఎస్టీ కమీషన్ ఛైర్మన్ రవిబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర షెడ్యూల్ తెగల కమీషన్ ఛైర్మన్ కె.రవిబాబు గురువారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో రవిబాబు గవర్నర్ కు కమీషన్ పరిధిలో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను గురించి వివరించారు. రాజ్యాంగ బద్దంగా షెడ్యూల్ తెగలకు అందవలసిన హక్కుల విషయంలో కమీషన్ తగిన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ షేడ్యూలు తెగలకు ప్రభుత్వ పధకాలు పూర్తిగా చేరేలా బాధ్యత తీసుకోవాలని …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు
-ఈనెల 27న ఖురాన్ ను కంఠస్తం చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేయు కార్యక్రమానికి విచ్చేయాలని ఆహ్వానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని ముస్లిం మైనార్టీ నాయకులు గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 27న అంబాపురంలోని మదర్సా ఇనామ్-ఉల్-ఉలూమ్ పాఠశాలలో పవిత్ర గ్రంథం ఖురాన్ ను కంఠస్తం చేసిన 22 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఎమ్మెల్యేను కోరారు. అనంతరం మల్లాది విష్ణు గారికి …
Read More »సకల హంగులతో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎల్బీఎస్ నగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద, సామాన్య ప్రజలందరూ అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరుపుకునే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కళ్యాణ మండప నిర్మాణానికి సంబంధించి ఎల్బీఎస్ నగర్ లో గురువారం స్థల పరిశీలన చేశారు. ఇందులో భాగంగా కాపు కార్పొరేషన్ ఎండీ రేఖా రాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజకుమారిలతో కలిసి పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాల పక్కనే …
Read More »సీఎం వైయస్ జగన్ అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారు… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.గురువారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ నుండి గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ప్రారంభించిన అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి …
Read More »దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభోత్సవంలో సీఎం వైయస్ జగన్…
సచివాలయం, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్ వాహనాలను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు దేవుడి దయతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దిశ డౌన్‌లోడ్స్… ఈ …
Read More »