-46వ డివిజన్ లంబాడిపేట హోలీ వేడుకలలో పాల్గొన్న నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోను పండుగ హోలీ, ఈ పండుగ వేళ భగవంతుని కరుణా కటాక్షలతో అందరు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. డివిజన్ పరిధిలోని లంబాడిపేట నందు లంబాడిలు, బంజారీలు ఎన్నో ఏళ్లుగా ఉంటూ అందరు కలసి ప్రతి ఏటా ఆనందంగా హోలీ నిర్వహించడం జరుగుతుందని, వారితో కలసి వేడుకలలో పాల్గొనుట సంతోషకరమని అన్నారు. …
Read More »Andhra Pradesh
పి.ఆర్.సి లో ఉద్యోగుల కు రావలసిన మిగతా జీవో లను ఇప్పించడంలో చొరవ చూపాలి… : వినుకొండ రాజారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదకొండవ పి.ఆర్.సి లో ఉద్యోగులకు రావలసిన మిగతా జీవోలను ఇప్పించుట కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు సంక్షేమం సలహాదారులు యన్. చంద్రశేఖర్ రెడ్డి గారు చొరవ చూపాలని మిగతా జీవోల కోసం రాష్ట్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉండడానికి సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారులు నియమించారని, కనుక ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం తమరు చొరవ చూపి పదకొండవ పి.ఆర్.సి లో ఉద్యోగులకు …
Read More »విధులలో అలసత్వం ప్రదర్శిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-తాగునీటి ఫిర్యాదులపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్షేత్రస్థాయి పరిశీలన -స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తాగునీటి సమస్యలపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. 62, 64 డివిజన్ లలో శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సిబ్బంది కాలనీలలో పర్యటిస్తున్నది లేనిది స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బర్మాకాలనీలోని సి5 బ్లాక్ నందు తాగునీటి సమస్య 4 రోజులుగా నెలకొనడంపై ఆగ్రహం వ్యక్తం …
Read More »కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుక్రవారం పరామర్శించారు. తొలుత ప్రజాశక్తి నగర్లో నివాసం ఉంటున్న సీనియర్ కార్యకర్త అక్కిశెట్టి నారాయణ నివాసానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కాలికి బలంగా గాయమై బాధపడుతున్న నారాయణకు ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అక్కిశెట్టి కుటుంబానికి వ్యక్తిగతంగా సాయం అందించడంతో పాటుగా.. అన్నివిధాలా అండగా ఉంటానని హామీనిచ్చారు. అనంతరం హృదయ …
Read More »ప్రజల జీవితాలు సప్త వర్ణాల శోభితం కావాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రంగుల కేళీ హోలీ ఉత్సవాలను నగర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబురాలు అంబరాన్నంటేలా వేడుకలు చేసుకున్నారు. ఆట పాటలతో కేరింతలు కొట్టారు. వన్ టౌన్ లోని మాడపాటి క్లబ్ నందు రాజపురోహిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. …
Read More »శబరిగిరీశుని సేవలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-దుర్గాపురంలో కన్నులపండువగా అయ్యప్పస్వామి జన్మదిన మహోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భక్తుల పాలిట కొంగుబంగారంలా నిలుస్తున్న అన్నదాన ప్రభువైన అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలోని అయ్యప్ప ఆలయాలు భక్తులతో అలరారాయి. సాధారణ భక్తులతో పాటు మాలధారణ చేసిన భక్తులు పెద్దసంఖ్యలో అయ్యప్ప ఆలయాలను దర్శించి భక్తితత్వంతో అయ్యప్పను ఆరాధిస్తూ శరణుఘోష చేశారు. దుర్గాపురంలోని అయ్యప్ప స్వామి ఆలయం నందు శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్పస్వామి వారి నామ నక్షత్ర జన్మదినోత్సవ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవ …
Read More »రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణంపై గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… ఇదో గొప్ప కార్యక్రమం… ఇళ్ల స్ధలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణాలపై ఈరోజు జరుగుతున్న చర్చా కార్యక్రమంలో చాలామంది శాససనభ్యులు అందరూ చక్కగా మాట్లాడారు. మంత్రి రంగనాథరాజుగారు కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ప్రతి శాసనసభ్యుడు కూడా సగర్వంగా ఏ నియోజకవర్గంలో అయినా వెళ్లి తిరుగుతూ.. నేను ఫలానా పని చేశాను అని సగర్వంగా చెప్పుకునే గొప్ప కార్యక్రమం …
Read More »తెలుగుటైమ్స్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికాలో గత 19 సంవత్సరాలుగా తెలుగు కమ్యూనిటీకి మీడియాపరంగా సేవలందిస్తున్న ‘తెలుగుటైమ్స్’ పత్రిక మొబైల్ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలోని ఎన్నారైలకు మీడియా వాహనంగా, ఎన్నారైలు మరియు తెలుగు రాష్ట్రాల మధ్య మీడియా వారధిగా సేవలందిస్తున్న తెలుగు టైమ్స్ 19వ వార్షిక శుభవేళలో తన మొబైల్ యాప్‌ను తీసుకువచ్చినందుకు శుభాభినందనలు అన్నారు. ‘ఈ రోజుల్లో అందరూ మొబైల్ ఫోన్‌లలో మాత్రమే వార్తలు మరియు …
Read More »తెలుగు రాష్ట్రాలో భగభగమంటున్నభానుడు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు తెలుగు రాష్ట్రాలో భానుడు భగభగమంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది. ఈ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలకు గాను బుధవారం మూడు …
Read More »కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్, డాబా కోట్లు రోడ్డు, గంగానమ్మ గుడి సెంటర్ వద్ద గురువారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలోకాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ (పార్టీ సభ్యత్వ నమోదు) కార్యక్రమం జరిగింది. ఈ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ చేరుకోవాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన …
Read More »